విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐ బిడ్డింగ్‌లో మరో ఏడు సంస్థలు
TeluguStop.com
విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐ బిడ్డింగ్ లో మరో ఏడు సంస్థలు పాల్గొన్నాయి.
ముందుగా బిడ్ వేసేందుకు ఆసక్తి కనబరిచిన సింగరేణి సంస్థ చివరకు బిడ్ వేయలేదు.
నేటి మధ్యాహ్నం 3 గంటలతో బిడ్ వేయడానికి గడువు ముగియగా ఇప్పటివరకు మొత్తం 29 కంపెనీలు బిడ్లు వేశాయి.
మరోవైపు సింగరేణి సంస్థ బిడ్ వేయకపోయినప్పటికీ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ ఈఓఐకి తొలుత ఈనెల 15కే గడువు ముగియగా మరిన్ని కంపెనీలు బిడ్లు వేసే అవకాశం ఉందని ఆర్ఐఎన్ఎల్ గడువును పెంచింది.
దీంతో మొత్తం మీద 29 కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి.
వివాదంలో చిక్కుకున్న సింగర్ మధుప్రియ…. అరెస్టు చేయాలి అంటూ డిమాండ్?