Virupaksha Review : విరూపాక్ష రివ్యూ: సాయిధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్..!
TeluguStop.com
డైరెక్టర్ కార్తీక్ వర్మ ( Karthik Verma )దండు దర్శకత్వంలో రూపొందిన సినిమా విరూపాక్ష.
డైరెక్టర్ కార్తీక్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.ఇక ఇందులో మెగా వారి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej )హీరోగా నటించగా ఈయన సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.
ఇక ఇందులో బ్రహ్మాజీ, అజయ్, సునీల్, సాయి చంద్ తదితరులు నటించారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.
ఎల్.పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బాపినీడు బి సమర్పణలో బిఎస్ఎన్.
ప్రసాద్( BSN.Prasad ) నిర్మించాడు.
ఇక సుకుమార్ ఈ సినిమాను రచించాడు.శాందత్ సాయినుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా.
అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచాయి.
ఇక తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక పెద్ద ప్రమాదం తర్వాత మొదటి సినిమాతో ముందుకొస్తున్నాడు సాయిధరమ్ తేజ్.మరి ఆయనకు ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.
కథ: కథ విషయానికి వస్తే ఈ సినిమా ఒక హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది.
రుద్రవరం అనే శిక్షణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో బ్లాక్ మ్యాజిక్, అఘోరాల నేపథ్యంలో రూపొందించారు.
ఇక ఇందులో సాయి ధరమ్ తేజ్ సూర్య అనే యువకుడి పాత్రలో కనిపిస్తాడు.
ఇక సూర్య రుద్రవరం మిస్టరీని చేదించే వ్యక్తి.అయితే రుద్రవరం అనే గ్రామంలో భయంతో కూడిన వరుస మరణాలు జరుగుతాయి.
అలా రోజు రోజుకు ఆ ఊరిలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.దీంతో చేతబడి వల్ల చనిపోతున్నారా లేదా మరేదైనా కారణాల వల్ల చనిపోతున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి సాయి ధరమ్ తేజ్ రంగంలోకి దిగుతాడు.
అలా చివరికి ఆ మరణాల వెనక ఎవరున్నారు.ఆ గ్రామ ప్రజలను ఎలా కాపాడాడు.
నందిని పాత్రలో కనిపించిన సంయుక్త మీనన్ ను ఎలా కలుస్తాడు అనేది మిగిలిన కథలోనిది.
"""/" /
నటినటుల నటన: సాయి ధరమ్ తేజ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
క్లాస్ సినిమా కైనా, మాస్ సినిమా కైనా అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేస్తాడు.ఈ సినిమాల్లో సూర్య పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు.
సీరియస్ లుక్ లో మాత్రం మెగా వారికి పోటీగా కనిపించాడు.ఇక నందిని పాత్రలో సంయుక్త మీనన్ బాగా నటించింది.
కానీ తన పాత్రకు అంతగా స్కోప్ లేనట్లు కనిపించింది.టెక్నికల్: ఇక ఈ సినిమాతో డైరెక్టర్ టాలీవుడ్ కు కొత్తగా పరిచయం కాగా.
తొలి పరిచయంలోనే అద్భుతమైన కథను పరిచయం చేశాడు.చాలావరకు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడు డైరెక్టర్.
అజనీష్ లోకనాథ్ సంగీతం బాగుంది.బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది.
శాందత్ సాయినుద్దీన్( Sandat Sainuddin ) అందించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.
ఇక మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి. """/" /
విశ్లేషణ: ఇక ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ మంచి కథతో చూపిస్తూ సినిమా మొత్తాన్ని బాగా హ్యాండిల్ చేసినట్లు కనిపించాడు.
ప్రతి ఒక్క సన్నివేశంలో ప్రేక్షకులను బాగా ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు.మధ్య మధ్యలో థ్రిల్లర్ అంశాలు మాత్రం మామూలుగా లేవని చెప్పాలి.
ఇక కొన్ని సన్నివేశాలతో అయితే వణుకు తెప్పించాడు డైరెక్టర్.ప్లస్ పాయింట్స్: సాయి ధరమ్ తేజ్ నటన, కామెడీ, సినిమా కథ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని ట్విస్టులు.
"""/" /
మైనస్ పాయింట్స్: థ్రిల్ మూవ్మెంట్స్ లో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.
హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాకింగ్ కాస్త బోర్ గా ఉంది.క్లైమాక్స్.
బాటమ్ లైన్: చివరిగా చెప్పాల్సిందేంటంటే హారర్ థ్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు.
మధ్య మధ్యలో కామెడీ అద్భుతంగా ఉందని చెప్పాలి.మొత్తానికి డైరెక్టర్ ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా చూపించాడు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి4, మంగళవారం 2025