యూఎస్ లో ‘విరూపాక్ష’ సాలిడ్ నెంబర్స్.. డే 1 వసూళ్లు ఇవే!
TeluguStop.com
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా ''విరూపాక్ష( Virupaksha )''.
సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ముందు నుండి బాగా ప్రమోషన్స్ చేసారు.
"""/" /
అనుకున్న విధంగానే నిన్న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు బాగానే కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.
కేవలం మౌత్ టాక్ తోనే వరల్డ్ వైడ్ గా పుంజుకుంటున్న ఈ సినిమా యూఎస్ లో కూడా గ్రాండ్ గానే రిలీజ్ అయ్యింది.
అక్కడ ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే కలిసి బాగానే కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తుంది.
"""/" /
ఈ సినిమా యూఎస్ రిపోర్ట్( USA Collections ) ప్రకారం 2 లక్షల డాలర్స్ గ్రాస్ ను టచ్ చేసినట్టు తెలుస్తుంది.
సరిగమ సినిమాస్ వారు యూఎస్ లో ఈ సినిమాను రిలీజ్ చేయగా మొదటి రోజు కలెక్షన్స్ అధికారికంగా రివీల్ చేసారు.
మరి ఈ సినిమా వీకెండ్ లో బాగానే రాబట్టే అవకాశం కనిపిస్తుంది.ఎలాగూ ఈ సినిమా పాజిటివ్ బజ్ రావడంతో వీకెండ్ దాటేసరికి సాలిడ్ నెంబర్స్ నమోదు చేసుకునే అవకాశం ఉంది.
"""/" /
ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.
ఈ మధ్య కాలంలో సుకుమార్ అసిస్టెంట్స్( Sukumar ) అంతా హీరోలకు మంచి మంచి హిట్స్ ఇస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా సుకుమార్ ఇచ్చిన కథతో ఈయన అసిస్టెంట్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.
రీల్ కోసం రైలు కింద పడుకున్న 15 ఏళ్ల కుర్రాడు.. తర్వాతేం జరిగిందో చూస్తే షాక్!