యూఎస్ లో మరో మైల్ స్టోన్ ను టచ్ చేసిన ‘విరూపాక్ష’.. వివరాలివే!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ''విరూపాక్ష''.

( Virupaksha ) ఈ సినిమా ఏప్రిల్ 21న తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే మంచి టాక్ తెచ్చుకుంది.

"""/"/ ఇక అప్పటి నుండి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకు పోతుంది అనే చెప్పాలి.

అందులోను ఈ సినిమాకు పోటీగా మరో సినిమా కూడా లేకపోవడంతో విరూపాక్ష కలెక్షన్స్( Virupaksha Movie Collections ) పరంగా కూడా రఫ్ఫాడిస్తుంది.

తెలుగులో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఆడియెన్స్ ను మెప్పిస్తుంది అనే చెప్పాలి.

అక్కడ రెస్పాన్స్ చూసి మేకర్స్ థియేటర్స్ కూడా పెంచేశారు.మరి ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి.

మొదటి నుండి యూఎస్ లో స్ట్రాంగ్ హోల్డ్ తో రాణిస్తున్న ఈ సినిమా ఎప్పుడో 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి ఒక మైల్ స్టోన్ చేరిపోయింది.

ఇక ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమా ఏకంగా 1.

5 మిలియన్ మార్క్ క్రాస్ చేసి సరికొత్త రికార్డును టచ్ చేసింది. """/"/ ఇలా సాయి తేజ్( Sai Tej ) తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.సుకుమార్ ఇంవోల్మెంట్ తో తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

దీంతో సుకుమార్ బ్రాండ్ ఈ సినిమాకు కూడా వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి.ఇక ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.