ఆదిపురుష్ చూశాక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసింది.. సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రభాస్( Prabhas ) ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ( Adipurush Movie ) యావరేజ్ హిట్ గా నిలిచినా ఈ సినిమాపై విమర్శలు మాత్రం ఆగడం లేదు.

వీకెండ్ లో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని సమాచారం అందుతోంది.

తెలుగులో ఆదిపురుష్ సినిమాకు అంతోఇంతో కలెక్షన్లు వచ్చినా ఇతర భాషల్లో భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే విషయంలో ఈ సినిమా ఫెయిల్ అయిందనే సంగతి తెలిసిందే.

అయితే వీరేంద్ర సెహ్వాగ్( Virendra Sehwag ) ఆదిపురుష్ చూశాక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసింది అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.

వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ కు ఇప్పటివరకు ఏకంగా 42000కు పైగా లైక్స్ వచ్చాయి.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ విషయంలో మండిపడుతున్నారు. """/" / ప్రభాస్ సినిమాను ఈ స్థాయిలో టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాను తీసిన మేకర్స్ ఈ కామెంట్ల గురించి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

ప్రభాస్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారనే సంగతి తెలిసిందే.ఆదిపురుష్ మూవీ గురించి వచ్చే కామెంట్ల గురించి ప్రభాస్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

"""/" / ప్రభాస్ గత మూడు సినిమాలు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో ప్రభాస్ కచ్చితంగా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

స్టార్ హీరో ప్రభాస్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

ప్రభాస్ కు క్రేజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వైరల్ వీడియో: ఓరి దేవుడా.. ఇంటి పైకప్పులో వింత శబ్దాలు.. ఏముందా అనిచూస్తే షాకే..