అనుష్క కోసం పాట పాడిన విరాట్... వీడియో వైరల్

మన ఇండియన్ క్రికెటర్స్, బాలీవుడ్ అందాల భామ బంధం విడదీయరానిది.పటౌడీ నుంచి ప్రస్తుతం కోహ్లి వరకు చాలా మంది క్రికెట్ అండ్ బాలీవుడ్ జంటలు ఉన్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటలలో చాలా మంది అందరికి ఆదర్శంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం తరంలో హార్దిక్ పాండ్యా కూడా బాలీవుడ్ హీరోయిన్ తో పెళ్ళికి ముందే బిడ్డని కని త్వరలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

అలాగే కె.ఎల్.

రాహుల్ కూడా బాలీవుడ్ భామతో ప్రేమాయణం సాగిస్తున్నాడు.మరికొంత మంది వర్ధమాన క్రికెటర్స్ కూడా బాలీవుడ్ భామలతో ఖాళీ సమయాలలో డ్యూయెట్లు పాడుకుంటున్నారు.

"""/"/ ఇదిలా ఉంటే ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి 2017లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆటగాడిగానే అందరిని మెప్పించిన్ విరాట్ కోహ్లి తనలో పాటగాడిని బయటకి తీసి పెళ్లి సమయంలో తన భార్య అనుష్క కోసం ఓ బాలీవుడ్ సాంగ్ ని ఆలపించాడు.

ఇటలీలో పెళ్లి సందర్భంగా జరిగిన సంగీత్ వేడుకలో ఒక పాటని అనుష్కకి డెడికేట్ చేశాడు.

ఈ సాంగ్ కి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ పాట విని అనుష్క చాలా భావోద్వేగానికి గురైంది.ఇదిలా ఉంటే రీసెంట్ గా విరుశ్క దంపతులకి ఒక పాప కూడా పుట్టింది.

ఆమెకి వామిక అనే పేరు పెట్టినట్లు చెప్పారు తప్ప ఇంకా ఆమె పేస్ ని ప్రపంచానికి పరిచయం చేయలేదు.

ఇదిలా ఉంటే అనుష్క శర్మ మళ్ళీ సినిమాలలో బిజీ అయ్యే ప్రయత్నం గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నట్లు తెలుస్తుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!