విరాట్ కోహ్లీ 10th మార్కుల మెమో ఎప్పుడైనా చూశారా..?

భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) తన పదవ తరగతి మార్కుల మెమోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విద్యార్థులకు ఒక సందేశాన్ని ఇచ్చాడు.ఏ పనైనా ఇష్టంగా చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతాము.అదే కష్టంగా చేస్తే ఫలితం శూన్యం.నమ్మిన రంగంలో కష్టపడితే జీవితంలో పైకి ఎదగొచ్చని, ఇతరుల నుంచి విమర్శలు వస్తాయని తమకు ఇష్టం ఉండే రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని సూచించాడు.

తాను పాఠశాలలో చదివే రోజుల్లో చదువు కంటే ఎక్కువగా క్రికెట్ కు( Cricket ) ప్రాధాన్యం ఇచ్చి, కష్టపడడంతో ఈ స్థాయికి వచ్చానని తెలిపాడు.2004లో టెన్త్ క్లాస్( 10th Class ) చదవడం పూర్తయింది.ఇక తన టెన్త్ క్లాస్ మార్కుల విషయానికి వస్తే, ఇంగ్లీషులో 83, హిందీలో 75, మ్యాథ్స్ లో 51, సైన్స్ లో 55, సోషల్ లో 74 మార్కులు తెచ్చుకున్నాడు.సోషల్ మీడియాలో #Let There Be Sport' అని పోస్ట్ పెట్టాడు.గత రెండు ఐపీఎల్ సీజన్ లలో ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ ఈసారి ఎలాగైనా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందించాలని కసితో ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీలు కొట్టి, తిరిగి ఫామ్ లోకి రావడంతో అభిమానుల్లో సంతోషం నెలకొంది.విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో ఇప్పటివరకు 223 మ్యాచ్లు ఆడి 6624 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్ లలో 32 సార్లు నాట్ అవుట్ గా నిలిచాడు.ఐపీఎల్ లో ఐదు సెంచరీలు, 44 అర్థ సెంచరీలు సాధించాడు.ఐపీఎల్ కెరీర్లో 578 బౌండరీలు, 218 సిక్సర్లు బాదేశాడు.ఈ ఐపీఎల్ సీజన్-16 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మొదటి మ్యాచ్ ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్ తో జరగనుంది.తొలి మ్యాచ్ నుంచే వరుస విజయాలతో ముందుకు సాగాలని విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి23, గురువారం 2025