ఔట్ అయినప్పుడు తానెందుకు నవ్వానో కారణం చెప్పిన విరాట్ కోహ్లీ..!
TeluguStop.com
2022 ఐపీఎల్ సీజన్లో వరుస మ్యాచ్ ల్లో విరాట్ కోహ్లీ తక్కువ స్కోరుకే వెనుదిరిగుతున్నాడు.
ఈ సీజన్లో ఏకంగా మూడు సార్లు డకౌట్ అయ్యాడు.అయితే ఔట్ అయిన ప్రతి సారి కోహ్లీ నవ్వుతూ పెవిలియన్ బాట పడుతున్నాడు.
దీంతో కోహ్లీ నవ్వు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.ఔట్ అయినప్పుడు ఏ బ్యాటర్ అయినా సరే నిరాశ, బాధ, కోపంగా ఫీల్ అవుతారు కానీ ఇలా నవ్వరు అని అభిమానులు కూడా కోహ్లీ తీరుపై అయోమయం గా ఫీల్ అవుతున్నారు.
అయితే వీరందరి సందేహాలను నివృత్తి చేసేందుకు స్వయానా కోహ్లీయే దీనిపై స్పందించారు.వచ్చే సీజన్లో ఏబీ డివిలియర్స్ బెంగళూరు టీమ్ లో కోచింగ్ స్టాఫ్‌గా జాయిన్ అవ్వచ్చని కూడా హింట్ ఇచ్చాడు.
"నా క్రికెట్ కెరీర్ మొత్తంలో ఇంతకు మునుపెప్పుడూ ఇలా జరగలేదు.ఆట ఎలాంటి పరిస్థితులను ఆటగాడికి చూపిస్తుందో నేనెప్పుడూ చూస్తున్నాను.
అందుకే నాకు నవ్వొస్తోంది" అని కోహ్లీ తెలిపాడు.ఒకప్పుడు బాగా రాణించిన కోహ్లీ ఇప్పుడు కొత్తగా వచ్చిన యువ ప్లేయర్ల కంటే దారుణంగా ఆడుతున్నాడు.
అందుకే అభిమానులతో పాటు అందరి నుంచి విమర్శలు వస్తున్నాయి.ముఖ్యంగా కోహ్లీ పూర్ ఫామ్‌పై టీ20 లీగ్ కామెంటేటర్లు దారుణంగా విమర్శలు చేస్తున్నారు.
వీటిపై కూడా కోహ్లీ స్పందించాడు."విమర్శించేవారు నా ప్లేస్ లో ఉండి ఆలోచించలేరు.
విమర్శల వల్ల నా పై ప్రతికూల ప్రభావం పడకుండా టీవీ రిమోట్‌లో మ్యూట్ బటన్ నొక్కడం, లేదంటే ఇతరుల మాటలను పట్టించుకోకుండా ఉండటం చేస్తున్నాను.
" అని విరాట్ చెప్పుకొచ్చాడు.
నాని హిట్3 సినిమాలో మరో స్టార్ హీరో కనిపించనున్నారా.. అసలేం జరిగిందంటే?