సాగర తీరంలో విరాట్ కోహ్లీ సైకత శిల్పం.. హ్యాపీ బర్త్డే కోహ్లీ
TeluguStop.com
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ( Virat Kohili) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నాడు.
ఇకపోతే, నేడు విరాట్ కోహ్లీ 36వ పుట్టినరోజు (Virat Kohli's 36th Birthday)జరుపుకుంటున్నాడు.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీకి టీమిండియా అభిమానులు, విరాట్ కోహ్లీ అభిమానులు పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు.
ఇక సోషల్ మీడియా వేదికగా కోహ్లీకి ప్రత్యేక శుభాకాంక్షలు కూడా అందజేస్తున్నారు. """/" /
ఈ క్రమంలో ప్రముఖ సైకత శిల్పి ఆయన సుదర్శన్ పట్నాయక్.
ఓ అద్భుతమైన ఆర్ట్ తో కోహ్లీపై అభిమానాన్ని చూపించాడు.ఒడిస్సా లోని పూరి బీచ్ లో ఐదు అడుగుల సైతక శిల్పాన్ని రూపొందించాడు సుదర్శన్ పట్నాయక్.
ఇందు కోసం దాదాపు నాలుగు టన్నుల ఇసుకను వాడాడు.సాండ్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులతో ఈ ఆర్ట్ ను రూపొందించి.
విరాట్ కోహ్లీ కి వారి అభిమానాన్ని తెలియచేశాడు.అలాగే భారీ పరిమాణంలో ఉన్న క్రికెట్ బ్యాటుపై హ్యాపీ బర్త్డే (Happy Birthday Kohli)టూ విరాట్ అని రాసి ఉంచారు.
ఈ శిల్పానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అది కాస్త వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
ఈ వీడియోని చూసిన కోహ్లీ ఫ్యాన్స్ ఖుషి అవుతూ.తన అభిమాన క్రికెటర్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కోహ్లీ పుట్టిన రోజును ఆయన అభిమానులు దేశ వ్యాప్తంగా ఘనముగా సంబరాలు నిర్వహిస్తున్నారు.
ఆ దేశంలో సైతం విడుదలవుతున్న ఎన్టీఆర్ దేవర.. సంచలన రికార్డులు మాత్రం పక్కా!