ఓ సరికొత్త రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ..

భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఓ సరికొత్త రికార్డుకు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.

ప్రస్తుతం క్రికెట్లో యాక్టివ్ గా ఉన్న ప్లేయర్లలో ఎవరు సాధించని ఘనత విరాట్ కోహ్లీ సాధించనున్నాడు.

వెస్టిండీస్ ( West Indies ) పర్యటనలో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ జూలై 20 నుంచి ప్రారంభం అవ్వనుంది.

ఆ మ్యాచ్ తోనే ఓ అరుదైన రికార్డ్ కోహ్లీ స్వంతం అవ్వనుంది.విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 499 అంతర్జాతీయ ( International) మ్యాచులు ఆడాడు.

జూలై 20 న జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ 500 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఏకైక చురుకైన క్రికెటర్ గా నిలువనున్నాడు.

రెండో టెస్ట్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ భారత క్రికెటర్ల ఎలైట్ క్లబ్లో చేరనున్నాడు.

అయితే భారత్ (India ) తరపున 500 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఆటగాళ్లు కేవలం ముగ్గురే ఉన్నారు.

వాళ్లు ఎవరో చూద్దాం. """/" / సచిన్ టెండుల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచులు ఆడి ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

తరువాత మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni) 535 అంతర్జాతీయ మ్యాచులు ఆడి ఆ జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు.

ప్రస్తుత భారత జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ 504 మ్యాచులు ఆడి ఆ జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచులు ఆడిన నాలుగవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలువనున్నాడు.

"""/" / అంతర్జాతీయ పరంగా చూసుకుంటే.ప్రపంచ టాప్-10 బ్యాట్స్ మెన్ లలో విరాట్ కోహ్లీ చేరనున్నాడు.

భారత్ తో పాటు తమ జట్టు కోసం 500 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ప్రపంచంలోని టాప్-10 ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ చేరనున్నాడు.

అయితే క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీ తన 500వ మ్యాచ్లో సెంచరీ( Centuries ) తో రికార్డ్ సృష్టించాలని కోరుకుంటున్నారు.

ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ కాంబో వర్కౌట్ అవుతుందా..?