మ్యాచ్ అనంతరం బాబర్ కు ఆటో గ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ..వీడియో వైరల్..!

వన్డే వరల్డ్ కప్ లో ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది భారత్- పాకిస్థాన్ మ్యాచ్( Ind Vs Pak ) అని అందరికీ తెలిసిందే.

తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది.మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

పాకిస్తాన్ ఆటగాళ్లను బ్యాటింగ్ లోను.బౌలింగ్ లోను భారత ఆటగాళ్లు పూర్తి కట్టడి చేయడంతో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.

"""/" / ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు( Pakistan Team ) 42.

5 ఓవర్లలో 10 వికెట్లను కోల్పోయి 191 పరుగులు చేసింది.భారత బౌలర్లు చెరో రెండు వికెట్లు తీసుకొని పాకిస్తాన్ బ్యాటర్లను వరుసగా పెవిలియన్ బాట పట్టించారు.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత జట్టు( Team India ) 30.

3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.

దీంతో భారత్ వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) చరిత్రలో వరుసగా 8వ సారి పాకిస్తాన్ పై పైచేయి సాధించింది.

తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ విషయానికి వస్తే ఆడిన మూడు మ్యాచ్లలో భారత్ ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

"""/" / ఈ మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది.

పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం( Babar Azam ) మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ దగ్గరకు వెళ్లి అతని జెర్సీ అడిగాడు.

కోహ్లీ( Virat Kohli ) తన జెర్సీ ఇస్తే దానిపై సంతకం చేయాలని బాబర్ పక్కనే ఉన్న పాకిస్తాన్ జట్టు సిబ్బందిని అడిగి పెన్ తీసుకొని కోహ్లీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు.

దీంతో బాబర్ ఆజాం విరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్ అని అక్కడ ఉండే ప్రేక్షకులకు అర్థమైంది.

ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చేరింది.ఇక ఈ మ్యాచ్ లో బాబర్ అర్ద సెంచరీ తో కాస్త పర్వాలేదు అనిపించాడు.

విరాట్ కోహ్లీ తొలి పవర్ ప్లే చివరి ఓవర్లో భారీ షాట్ ఆడెందుకు ప్రయత్నించి వికెట్ పారేసుకుని అనుకున్నా రీతిలో ఆకట్టుకోలేకపోయాడు.

బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో సక్సెస్ కొట్టబోతున్నాడా..?