ఐపీఎల్ లో రూల్స్ అతిక్రమిస్తే జరిమానే.. విరాట్ కోహ్లీ కి ఫైన్..!

ఈ ఐపీఎల్ సీజన్లో నిబంధనలు కాస్త ఉల్లంఘించిన జరిమానా కట్టాల్సిందే.తాజాగా విరాట్ కోహ్లీ( Virat Kohli )కు ఊహించని గట్టి షాకే తగిలింది.

ఐపీఎల్ రూల్స్ ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ, ఐపీఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది.

"""/" / తాజాగా బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో బెంగుళూరు - చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఐపీఎల్ కోడ్ లోని ఆర్టికల్ 2.

2 లోని లెవెల్ 1 నిబంధన ఉల్లంఘించడంతో మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించబడింది.

అయితే ఏ ఘటన ఆధారంగా విరాట్ కోహ్లీకి జరిమానా విధించారనే విషయం ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించలేదు.

ఒకవేళ చెన్నై జట్టు బ్యాటర్ శివం దూబే( Shivam Dube ) అవుట్ అయిన సమయంలో విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరు కారణంగానే ఫైన్ విధించి ఉండవచ్చని తెలుస్తుంది.

"""/" / చెన్నై జట్టు బ్యాటర్ శివం దూబే 26 బంతుల్లో 52 పరుగులు చేసి పార్నెల్ బౌలింగ్లో సిరాజ్( Mohammed Siraj ) కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఆ సమయంలో పట్టలేని ఆనందంతో ఆకాశమే హద్దుగా సెలబ్రేషన్స్ చేసుకున్న కోహ్లీ కాస్త శృతి మించినట్లు అనిపించింది.

కాస్త దూకుడుగా ప్రవర్తించిన కారణంగా చివరకు జరిమానా పడినట్లు తెలుస్తుంది. """/" / ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ తో పాటు వివిధ కారణాల వల్ల సూర్య కుమార్ యాదవ్( Suryakumar Yadav ), హార్థిక్ పాండ్యా లాంటి ఆటగాళ్ల కు జరిమానా విధించబడింది.

గత ఐపీఎల్ మ్యాచ్ల కంటే ఈ ఐపీఎల్ మ్యాచ్లలో జరిమానా కు గురయ్యే ఆటగాళ్ల సంఖ్య కాస్త ఎక్కువే అనిపిస్తుంది.

ఇక బెంగళూరు జట్టు పై చెన్నై జట్టు విజయం సాధించి లీగ్ పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరింది.

వెంకటేశ్ అనిల్ మూవీ టైటిల్ మారిందా.. కొత్తగా రిజిష్టర్ చేసిన టైటిల్స్ ఇవేనా?