వైరల్ వీడియో : కోహ్లీ నువ్వేమి అసలు మారలేదుగా.. హర్భజన్‌ను ఆటపట్టిస్తూ డాన్స్

బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో( Gabba Stadium ) భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు వర్షం కారణంగా అప్పుడప్పుడు ఆటకు అడ్డు పడుతోంది.

మొదటి రోజు మొత్తం ఆటలో చాలా వరకు రద్దు కాగా, రెండో రోజు కొంత మేర సాగింది.

మూడో రోజుకూడా వర్షం అంతరాయం కలిగించడంతో గబ్బాలో ఇరు జట్లు వర్షంతో సతమవుతున్నారు.

ఈ నేపథ్యంలో, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ,( Virat Kohli ) మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్( Harbhajan Singh ) మధ్య జరిగిన సరదా సంఘటన సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

తొలి రోజు ఆట ప్రారంభానికి ముందు చోటుచేసుకున్న ఈ సన్నివేశంలో కోహ్లీ, హర్భజన్‌తో చేసిన సరదా డ్యాన్స్ వీడియో కాస్త ఆలస్యంగా వైరల్‌గా మారింది.

"""/" /ఈ వైరల్ వీడియోలో కోహ్లీ డ్యాన్స్( Kohli Dance ) చేస్తూ హర్భజన్‌ను నవ్వించాడు.

కోహ్లీ కోరికపై భజ్జీ కూడా బలవంతంగా డ్యాన్స్ చేయాల్సి వచ్చింది.ఈ విషయం గురించి హర్భజన్ మాట్లాడుతూ.

"కోహ్లీ నన్ను చూసి ‘జీతేంద్ర ఇక్కడికి వచ్చాడు!’ అని అన్నాడు.ఆపై అతను ‘నైనో మే సప్నా, సప్నో మే సజ్నా’ పాట పాడటం మొదలుపెట్టాడు.

మొదట విరాట్ ఏమి చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు.ఎందుకంటే, అతను నాకు దూరంగా నిలబడి ఉన్నాడు.

తర్వాత నేను నవ్వు ఆపుకోలేకపోయాను.చివరికి నేనూ హుక్ స్టెప్పులు వేయడం ప్రారంభించాను” అంటూ చెప్పుకొచ్చాడు.

"""/" / అంతేకాకుండా, హర్భజన్ వేసుకున్న డ్రెస్‌పై కోహ్లీ సరదాగా ఆటపట్టించాడు."ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు?" అంటూ చమత్కరించగా, భజ్జీ ఆ డ్రెస్ ప్రత్యేకత గురించి కోహ్లీకి వివరించే ప్రయత్నం చేశాడు.

ఈ సరదా సన్నివేశం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.మాములుగా విరాట్ కోహ్లీ ఆట పరంగా ఎంత సీరియస్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అంతేకాదు మరో యాంగిల్ లో విరాట్ తన సహచరులతో ఎంత పర్చకంగా ఉంటాడో కూడా అనేకసార్లు చూసాం.

ఇప్పుడు కూడా ఇదివరకు తన సహచరుడైన హర్భజన్‌ను ఆట పట్టించాడు.

నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్