నడిరోడ్డుపై అక్కడ ఒంటిరిగా విరాట్ కోహ్లీ..
TeluguStop.com
విరాట్ కోహ్లీ( Virat Kohli ).ప్రపంచవ్యాప్తంగా ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
నోటితో కాకుండా తన బ్యాటింగ్ తో నోర్లు మూయించే కెపాసిటీ ఉన్న వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు.
భారతీయులందరూ విరాట్ కోహ్లీని కింగ్ కోహ్లీగా ముద్దుగా పిలుచుకుంటారు.ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే తనదైన శైలితో బౌలర్ల పై విరుచుకుపడతాడు విరాట్ కోహ్లీ.
"""/" / ఇకపోతే తాజాగా 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ ( T20 World Cup )విజయం తర్వాత టి20 ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఆయన రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా శ్రీలంకలో( Sri Lanka ) జరిగిన సీరిస్ లో భాగంగా కోహ్లీ తనదైన ఆటను ఆడాడు.
ఇక ఆ సీరిస్ ముగిసిన తర్వాత కోహ్లీ భారత్ కు రాకుండా నేరుగా కొలంబో నుండి లండన్ కు ప్రయాణించాడు.
ఇకపోతే కొడుకు అకాయ్ పుట్టినప్పుడు నుంచి విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్( London ) లోనే జీవిస్తున్నాడు.
అయితే ఇప్పుడు లండన్ లో విరాట్ కోహ్లీ ఏం చేస్తున్నాడన్న విషయం సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
"""/" / ఈ వీడియోలో రన్ మిషన్ విరాట్ కోహ్లీ చాలా ప్రశాంతంగా లండన్ వీధులలో జరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఒక సామాన్య వ్యక్తి ఎలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తాడో అలా కనిపించాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రోడ్డు మధ్యలో సిగ్నల్ దాటుతున్న సమయంలో విరాట్ కోహ్లీ నిలబడి ఉన్న వీడియో ట్రెండింగ్ గా మారింది.
ఇక ఈ వీడియో చుసిన నెటిజన్స్ రాజు ఎక్కడున్నా రాజే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఏంటి బాస్.. ఎప్పుడు దోశలు తినలేదా.. మరి ఇంత కక్కుర్తి ఏంటి? (వీడియో)