డేట్ కి వెళ్లి 5 నిమిషాల్లో పారిపోయానంటున్న కోహ్లీ..!

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ఎంటీవీ వీజే అనూశ దండేకర్‌ ఓ ప్రైవేల్‌ పార్టీలో యుక్త వయసులో ఉన్న కోహ్లిని ఇంటర్వ్యూ చేసిన వీడియో ఇది.

దీనిలో అనూశ ర్యాపిడ్‌ ఫైర్‌ ఫార్మట్‌లో యంగ్‌ కోహ్లిని కొన్ని ప్రశ్నలు అడిగింది.

వాటిలో ‘‘మీ జీవితంలో త్వరగా ముగిసిన భోజనం, స్నానం, డేట్‌’’ గురించి ప్రశ్నించింది.

దానికి బదులుగా కోహ్లి ఒకమ్మాయితో బ్లైండ్‌ డేట్‌కి వెళ్లానని కానీ ఆమె అందంగా లేకపోవడంతో ఐదు నిమిషాల్లో అ‍క్కడి నుంచి పారిపోయాను అని చెప్పడం వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఇంకా వీడియోలో కోహ్లి మాట్లాడుతూ ‘‘ఒకసారి బ్లైండ్‌ డేట్‌కి వెళ్లాను కానీ అది కేవలం ఐదు నిమిషాల్లో ముగిసింది.

ఆ అమ్మాయి అంత అందంగా లేదు.తనను చూడగానే అక్కడ నుంచి వెళ్లిపోయాను’’ అని కెమెరా వైపు చూసి ‘‘సారీ.

కానీ ఆ అమ్మాయి అంత అందంగా లేదు’’ అని తెలిపాడు.ఇక ఈ ఇంటర్వ్యూలో కోహ్లి బాలీవుడ్‌ హీరోయిన్‌ల గురించి కూడా మాట్లాడాడు.

అయితే తన భార్య అనుష్క గురించి కాదు.‘‘ఏ హీరోయిన్‌ క్రికెట్‌ ఆడాలనుకుంటే మీరు చూడాలనుకుంటున్నారు’’ అనే ప్రశ్నకు కోహ్లి జెనిలియా అని సమాధానం చెప్పాడు.

ప్రస్తుతం ఈ వీడియో మరోసారి వైరలవుతోంది.కాగా, బాలీవుడ్ అగ్రకథానాయక అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే.

అనంతరం వీరిద్దరూ ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. """/"/ ప్రస్తుతం విరుష్క దంపతులకు ఓ పాప కూడా ఉంది.

తాజాగా భారత మాజీ మహిళా క్రికెటర్ స్రవంతి నాయుడు తల్లి కరోనా బారినపడగా విరాట్ కోహ్లీ పెద్ద మనసుతో ఆర్థికసాయం అందించాడు.

స్రవంతి నాయుడు తల్లి ఎస్కే సుమన్ ప్రస్తుతం హైదరాబాదులో కరోనా చికిత్స పొందుతున్నారు.

ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో సాయం చేయాలంటూ స్రవంతి బీసీసీఐ, హైదరాబాద్ క్రికెట్ సంఘంను కోరింది.

బీసీసీఐ సౌత్ జోన్ మాజీ కన్వీనర్ ఎన్.విద్యాయాదవ్ తన ట్వీట్ కు విరాట్ కోహ్లీని కూడా ట్యాగ్ చేశారు.

దాంతో వెంటనే స్పందించిన కోహ్లీ.స్రవంతి నాయుడు తల్లి కోసం రూ.

6.77 లక్షలు విరాళంగా అందించారు.

వాలంటీర్ల కు కోతలు మొదలు… ఆ విధులు వీరికి అప్పగింత