ఇంస్టాగ్రామ్ లో కూడా తన మార్క్ ను చూపిస్తున్న టీమిండియా కెప్టెన్…!

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.కాస్త ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కోహ్లికి ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య 75 మిలియన్లకు చేరింది.

దీంతో ప్రపంచ అథెట్ల అత్యధిక ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ జాబితాలో క్లోహ్లీ నాలుగో స్థానానికి చేరాడు.

ట్వీట్టర్, ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ.ఫిట్ నెస్ మీద, సోషల్ యాక్టివిటీస్ మీద, భార్య అనుష్కతో తీసిన సరదా వీడియోలపై, బ్రాండ్స్ కు సంబంధించిన వీడియోలు ఎప్పుడు పోస్ట్ చేస్తుంటారు.

లేటెస్ట్ అప్డేట్ అప్లోడ్ చేస్తు అభిమానులను అలరిస్తుంటారు.అయితే అథ్లెట్ల విషయంలో ఇంస్టాగ్రామ్ పరంగా 75 మిలియన్ల ఫాలోవర్స్ దాటడంతో ఆసియాలో ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు.

కోహ్లీ కంటే ఇప్పటికే ఇంస్టాగ్రామ్ మొదటి స్థానంలో రొనాల్డో, రెండవ స్థానంలో లియోనెల్ మెస్సీ, మూడో స్థానంలో నెయ్ మార్ ఉన్నారు.

భారత కెప్టెట్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అంతర్జాతీయ క్రికెట్ లో అడుగువేసినప్పటి నుంచి తన అద్భుతమైన ప్రదర్శనతో ఎవరికీ లేని ఫ్యాన్ పాలోయింగ్ ను పెంచుకున్నాడు.

మైదానంలో బ్యాట్ పట్టుకుని దిగితే చాలు ప్రత్యర్థులకు చెమటలు పట్టేవి.పాత రికార్డులను బ్రేక్ చేస్తూ తన పేరుతో కొత్త రికార్డులను నెలకొల్పాడు.

కోహ్లీ ఆటకు ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో అభిమానులున్నారు.లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన కోహ్లీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వచ్చారు.

అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఐపీఎల్ కూడా ప్రారంభించే బీసీసీఐ యోచిస్తోంది.

దీంతో తన జట్టు అయిన రాయల్ చాలెంజర్స్ టైటిల్ గెలుచుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.

యెమెన్‌లో భారతీయ నర్స్‌కు మరణశిక్ష .. భారత్‌కు ఇరాన్ ఆపన్న హస్తం, కాపాడతామని హామీ