వైరల్: రెండు చేతులతో రెండు భారీ పాములను పట్టేసుకున్న యువతి!
TeluguStop.com
సాధారణంగా మనలో అనేకమంది పాములను దూరం నుంచి చూసి గజగజ వణికిపోతూ కేకలు వేస్తూ వుంటారు.
అదే పాము దగ్గరకు వస్తే.ఇంకేముంది గుండె ఆగినంత పనవుతుంది.
అలాంటిది ఓ యువతి ఒట్టి చేతులతో రెండు భారీ విషసర్పాలను చాలా ఈజీగా పట్టేసుకుంటుందంటే మీరు నమ్ముతారా? మీకు ఆశ్చర్యంగా వున్నా ఇది నమ్మాల్సిందే మరి.
> """/" / వైరల్ అవుతోన్న వీడియోని ఒకసారి చూస్తే అదొక కాలేజీ క్యాంపస్ లేదా ఓ ప్రభుత్వ కార్యాలయం అని అర్ధం అవుతోంది.
అక్కడ ఖాళీ ప్రదేశంలో రెండు భారీ విషసర్పాలు ఒకదానికి మరొకటి చుట్టుకుని ఉండడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
> """/" /
వాటిని చూసిన అక్కడి జనాలు భయంతో బిగ్గరగా కేకలు పెడుతుంటే ఓ యువతి( Woman ) మాత్రం వాటిని గమనిస్తూ సరైన సమయం చూసి.
దాడికి దిగినట్లుగా ఆ 2 పాములను ఒక్కసారిగా ఒట్టి చేతులతో పట్టేసుకోవడం గమనించవచ్చు.
దాంతో అవి ఆమె పట్టు నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించినా.ఆ యువతి మాత్రం వెంబడించి మరీ.
వాటి తొకలను పట్టుకుని లాగుతుంది చూడండి.> """/" /
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతుండగా దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
‘ఏంటక్కా.! నీ ధైర్యం’ అని కొందరు కామెంట్ చేస్తే, ‘అక్కో.
అది పాము అనుకున్నావా.పొట్లకాయ అనుకున్నావా’ అని మరికొందరు కామెంట్ చేయడం ఇక్కడ చూడవచ్చు.
ఇకపోతే ఆమెని కొందరు ప్రొఫెషనల్ గా గుర్తిస్తున్నారు.కాగా ఆమె అలా ఆ రెండు పాముల( Two Sankes )ను పట్టుకొని ఎక్కడో అడవి ప్రాంతంలో వదిలేసినట్టు కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా ఒక యువతి అయి ఉండి, మగాళ్లకు ధీటుగా ఇలా భయపడకుండా పాములు పెట్టుకోవడాన్ని కొందరు కీర్తిస్తున్నారు.