వైరల్: పులితో యువతి ముద్దులాటలు… ముద్దులకు హద్దులు వుండాలమ్మ అంటున్న నెటిజన్లు!
TeluguStop.com
సోషల్ మీడియా వినియోగం పెరిగాక విశ్వవ్యాప్తంగా వున్న వింతలూ విశేషాలను తెలుసుకోగలుగుతున్నాం.ఈ క్రమంలోనే రకరకాల జంతువులకు సంబందించిన వీడియోలు వైరల్ కావడం మనం తరచూ చూస్తూ వున్నాం.
ఇక క్రూర జంతువులకు మారుపేరైన సింహాలు, పులులు మనుషులతో ఆడుకుంటే ఎలాగుంటుంది? చూడడానికి భలే సరదాగా ఉంటుంది కదూ.
తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
"""/" /
ఇక్కడ వీడియోలో చూసేందుకు టెడ్డీబేర్ (Teddybear )వలె కనిపిస్తున్న పులి( Tiger ).
ఓ యువతిని తెగ ఆకట్టుకోవడంతో దానితో ఆడుకోవాలని ఆ యువతి ఆరాటపడుతోంది.దీంతో ముందూ వెనుకా ఆలోచించకుండా ఆమె పులికి హగ్గులిస్తూ, ముద్దులు మీద ముద్దులు పెడుతోంది.
ఎన్‌క్లోజర్‌లో ప్రశాంతంగా పడుకుని ఉన్న ఓ పెద్ద పులి చూడడానికి నిజంగా టెడ్డీబేర్‌లా కనబడుతుండడం విశేషం.
ఆ సమయంలో పులి కూడా చాలా కూల్‌గా ఉండడం కొసమెరుపు. """/" /
మొదట పులి మెడపై తన చేత్తో నిమిరిన యువతి.
తర్వాత ముద్దులు, హగ్గులు అంటూ ప్రేమగా వాటేసుకుంటోంది.అంతటితో ఆగకుండా పులిపై ముద్దుల వర్షం కురిపిస్తుంది.
యువతి అంత ఇబ్బంది పెడుతున్నా.పులి ఏమీ అనకుండా చిన్న పిల్లిలా మారిపోవడం విశేషం.
ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా వెలుగు చూసింది.
ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ కాగా దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
''జాగ్రత్త పాప! అది పిల్లి కాదు.పెద్ద పులి''.
అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, ''ఈ పులి సాధుజంతువు''.అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
వీడియో: స్కూల్ గర్ల్స్ను వేధించిన వ్యక్తి.. బెల్టుతో చితకబాదిన అమ్మాయిలు..