వైరల్: ఎత్తయిన మహిళ విమానంలో ప్రయాణించగా, కూర్చోబెట్టలేక సిబ్బంది ఆమెని ఇలా పడుకోబెట్టారు?

రుమెయ్‌సా గెల్గీ గురించి మీకు తెలిసే ఉంటుంది.ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ టర్కీ మహిళ గిన్నిస్‌ రికార్డులకెక్కిన సంగతి అందరికీ తెలిసినదే.

కాగా ఇంతవరకు విమానమంటే తెలియని ఆమె తొలిసారిగా విమాన ప్రయాణం చేశారు.ఈ నేపథ్యంలో ఇస్తాంబుల్‌ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు 13 గంటలపాటు ఆమె విమానంలో ప్రయాణించవలసి వచ్చింది.

కాగా ఆమె కోసం టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేయవలసి వచ్చింది.

ఆమె ప్రయాణానికి 6 సీట్లు కావలసి వచ్చింది.అవును, ఓ 6 సీట్లను స్ట్రెచర్‌గా తయారు చేసి, ఆమె నిద్రించేందుకు అనువుగా మార్చారు.

ఆమె ఎత్తు అక్షరాలా 215.16 సెంటీమీటర్లు కావున అంత ఎత్తైన ఆమె సదరు విమానంలో కూర్చోవడం కష్టంగా మారింది.

కావున అలా ఏర్పాటు చేసారు.ఇక దీనిపై రుమెయ్‌సా ఎయిర్‌లైన్స్‌ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ."నా మొదటి విమాన ప్రయాణం ఎంతో చక్కగా సాగింది.

నాతో పాటు ప్రయాణించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.నా తొలి విమాన ప్రయాణం చివరిది కాకూడదని కోరుకుంటున్నా!" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

"""/"/ కాగా దీనిపై టర్కీ ఎయిర్‌లైన్స్‌ సంస్థ కూడా స్పందించింది.ఆమెకి భవిష్యత్‌లో ఏ సాయం కావాలన్నా ఇలాగే తోడ్పాటు ఉంటుందని హామీ ఇచ్చింది.

ఇకపోతే రుమెయ్‌సా అత్యంత పొడవైన వేళ్లు కలిగిన మహిళగా, అత్యంత పొడవైన వీపు కలిగిన మహిళగానూ అనేక రికార్డులకెక్కింది.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు పేర్కొన్న వివరాల ప్రకారం.వేవర్‌ సిండ్రోమ్‌ అనే జన్యు సమస్య కారణంగానే ఆమె ఇలా అసాధారణమైన ఎత్తు పెరిగినట్టు భోగట్టా.

దీనివల్ల కొన్నిచోట్ల ఎముకలు అవసరమైన దాని కంటే ఎక్కువగా పెరిగిపోతాయి.దీంతో నడవడం, ఊపిరితీసుకోవడం, మింగడం ఆమెకి కష్టతరమవుతుంది.

వైరల్ వీడియో: ఈ బుల్లి ఎలుగుబంటి అల్లరి మాములుగా లేదుగా