వైరల్: చీరకట్టులో స్టంట్ చేద్దామని బయలుదేరిన సుందరాంగి, మగాళ్లకు సవాళ్లు విసురుతోంది!

తాజా లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నట్టు సమాచారం.

దాంతో సోషల్ మీడియా పరిథి పెరుగుతున్నవేళ రకరకాల వీడియోలు, రీల్స్ చేసే వారి సంఖ్య రానురాను పెరిగిపోతుంది.

వివిధ సోషల్ మీడియా మాధ్యమాలద్వారా ఎవరి టాలెంట్ వారు ప్రూవ్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో కొంతమంది డ్యాన్స్ వీడియోస్ చేస్తే, మరికొందరు డైలాగులు చెబుతున్నారు, ఇంకొందరు ఏకంగా స్టెంట్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే స్టెంట్స్ అనేవి మగవాళ్ళు చేస్తే ఓకే.కానీ ఈ మధ్య అమ్మాయిలు కూడా ట్రై చేసే ఔరా అనిపిస్తున్నారు.

అమ్మాయిలు ఈ మధ్యకాలంలో అబ్బాయిలకు మేమేమి తక్కువకాదు అని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి చేసిన ఫీట్ కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తోంది.

ఆ ఫీట్ చేసేటప్పుడు పేంటు, టి షార్ట్ వేసుకుంటే ఓకే కానీ, ఆమె ఏకంగా చీర కట్టులో ఉండగానే అటువంటి డేర్ చేయడం ఇపుడు నెటిజన్లను ఒకింత ఆశ్చర్యపరుస్తోంది.

గతంలో ఓ అమ్మాయి చీరకట్టులో ఇటువంటి బ్యాక్ ఫ్లిప్ చేయగా.మరో అమ్మాయి రోడ్డుపై అందంగా స్కేటింగ్ చేసిన వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యింది.

"""/" / తాజాగా ఓ అందమైన అమ్మాయి చీరకట్టులో బ్యాక్ ఫ్లిప్ చేసి, మగాళ్లకు సైతం సవాళ్లు విసిరింది.

దీనికి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఓ రోడ్డు పక్కన స్కూటీని పార్క్ చేసి.

దానిపై ఓ అమ్మాయి సంప్రదాయ చీరకట్టులో నిలబడి, కెమెరా.యాక్షన్ అని చెప్పగానే సెకెను వ్యవధిలో స్టైల్ గా బ్యాక్ ఫ్లిప్ చేసింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఆ వీడియోను మీరు ఓసారి ఓసారి తిలకించి అభిప్రాయాన్ని చెప్పండి.

తండ్రి రైతు.. ఇంటర్ లో 968 మార్కులు సాధించిన సాయిశ్వేత.. ఈమె సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!