వైరల్: పాము తోక పట్టుకుని లాగుతున్న ఈ యువకుడిని ఏమనాలి?

సోషల్ మీడియా( Social Media ) అందుబాటులోకి వచ్చాక అనేక రకాల విషయాలను ఖర్చు లేకుండా చేసేయ గలుగుతున్నాము.

అవును, వివిధ ప్రాంతాలకు వెళ్లకుండానే అక్కడ జరిగే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోగలుగుతున్నాము.ఈ క్రమంలో ఇక్కడ కొన్ని రకాల వీడియోలు వైరల్ అవుతూ వుంటాయి.

అందులో కొన్ని ఫన్నీగా వుంటే, మరికొన్ని ఆశ్చర్యంగా వుంటాయి.కొన్ని చిత్రంగా వుంటే మరికొన్ని విచిత్రంగా అనిపిస్తూ వుంటాయి.

ఇక కొన్ని వీడియోలు వుంటాయి.అవి చాలా గగుర్పాటుకి గురయ్యేలా చేస్తాయి.

అవును, ఎలాంటి శిక్షణ, అనుభవం లేకుండానే కొందరు ఏవేవో కొంటె పనులు చేస్తూ దానిని సాహసం అని చెప్పుకోవడానికి యత్నిస్తూ వుంటారు.

"""/" / ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి ఓ వీడియోనే.ప్రస్తుత కాలంలో కొందరి తింగరి చేష్టలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.

సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి పనులు చేసేవారి సంఖ్య ఎక్కువయిపోయింది.బోనులో ఉన్న క్రూరమృగాలతో చెలగాటం ఆడుతూ కొందరు, పారిపోతున్న పాముల( Snake )ను పట్టుకుని ఇబ్బంది పెడుతూ మరికొందరు.

ప్రజల ఆగ్రహానికి గురైన సందర్భాలను మనం చాలా చూశాం.ఇలాంటి వీడియోలు ఇటీవల చాలా చూశాం.

తాజాగా, ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. """/" / ఈ వీడియోలో ఓ యువకుడు పాము తోక( Snake Tail ) పట్టుకుని డాన్సులు వేశాడు.

దాంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.ఇంటి పరిసరాల్లోకి వచ్చిన నాగుపాము తోకను పట్టకున్న అతను పక్కకు లాక్కొచ్చాడు.

అంతటితో దాన్ని వదిలేయకుండా.తోకను పట్టుకుని పాముతో ఓ ఆట ఆడుకోవాలని చూస్తాడు.

ఈ క్రమంలో దాన్ని రెచ్చగొడుతూ డాన్సులు వేస్తూ ఇబ్బంది పెడతాడు.ఒకానొక దశలో పాము అతడిపై బుసలు కొట్టి భయపెడుతుంది.

కానీ యువకుడు మాత్రం దాని కాటు నుంచి తప్పించుకుంటూ పామును ఇబ్బంది పెడుతూనే ఉంటాడు.

ఆ పాము నా దారిని నన్ను వదిలేయరా బాబు అన్నట్టు చూస్తుంది కానీ వదలకుండా చిరాకు తెప్పిస్తాడు.

మధ్య మధ్యలో పాము చాలా సార్లు అతడిని కాటు వేయాలని ప్రయత్నిస్తుంది.అయితే అదృష్టం బాగుండి.

అతను దాని కాటు నుంచి తప్పించుకుంటాడు.చివరగా తోకను వదలడంతో పాము అక్కడి నుంచి పొదల్లోకి వెళ్లిపోతుంది.

ఇతడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ''ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి'' అంటూ కామెంట్లు చేస్తున్నారు.