వైరల్: ఈ బామ్మ స్టెప్పులు చూడండి… పూనకాలు లోడింగ్ అంటే ఇదే!
TeluguStop.com
నిండా ముప్పై ఏళ్ళు నిండని వయస్సులో వున్న యువతులు నడుం నొప్పి అని, కాళ్ళ నొప్పులు అని, కడుపు నొప్పు అని చేయవలసిన పనులను వాయిదాలు వేస్తూ వుంటారు.
అలాంటిది నిన్నటి తరం కాదు, మొన్నటి తరం ఓ ముసలావిడ చేసిన పనికి ఇపుడు చాలామంది యువతులు మంత్రముగ్ధులు అవుతున్నారు.
అరెరే.ఆ వయస్సు మాకు వచ్చిందంటే ఖచ్చితంగా నడుం విరిగి ఓ మూలన కూర్చోవడం ఖాయం అని అనేస్తున్నారు అంటే.
ఆమె చేసిన పనిని మనం ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. """/" /
అవును, ఆమె ఓ మ్యూజిక్ వింటూ లోకాన్ని మర్చిపోయి మరీ డ్యాన్స్ చేస్తుంది.
వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే అందులో ఓ బామ్మ( Grandma ) ఎనర్జిటిక్ స్టెప్పులు వేసి అందరినీ షాక్‌కు గురి చేయడం ఇక్కడ గమనించవచ్చు.
మహిళల కోసమే ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్టేజ్‌పై ఉన్న సింగర్స్ పాటపాడుతుంటే అక్కడున్న వారంతా డ్యాన్స్ చేశారు.
అందులో దాదాపుగా యువతులు మాత్రమే వున్నారు.అయితే వారికంటే ధీటుగా ఆ ముసలావిడ డాన్స్( Old Lady Dance ) చేయడం ఇపుడు అందరికీ ఆశ్చర్యపరుస్తోంది.
"""/" /
ఓ మరాఠీ పాటకు ఆమె అద్భుత స్టెప్పులతో అందరికీ మైమరిపించింది.
అందుకే అందరి కెమెరాలు ఆమెవైపే వున్నాయి.ఆమెకు దాదాపు 70 ఏళ్లు ఉంటాయి.
ఆ బామ్మ.చుట్టుపక్కన వారిని పట్టించుకోకుండా, పూర్తిగా పాటను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేయడం నెటిజన్లను బాగా మెప్పించింది.
అవును, ఆమె స్టామినా చూసి అవాక్కువుతున్నారు.ఆ వయస్సులో ఉరకలేస్తున్న ఆమె ఉత్సాహం చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
కొంతమంది అదిరిపోయింది బామ్మా.మేము కూడా ఇలా డాన్స్ చేయలేము అని కొందరంటే మాకు మా బాల్యం గుర్తొచ్చింది బామ్మ.
అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఐసీసీ అవార్డ్స్ లో దుమ్ములేపిన టీమిండియా ఆటగాళ్లు