వైరల్: మంచుతో ఆడుతున్న ఒంటెని చూడండి… చిన్నపిల్ల అయిపోయింది!

ఒంటె ఓ ఏడారి సాధు జంతువు.అలాంటి ఒంటెకి ఎడారి ఇసుక తప్ప తన జీవితంలో మంచును చూసి ఉండదు.

అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే అలాంటి ఓ ఒంటికి మొదటిసారి మంచు కనబడుతుంది.

ఇక అంతే, ఆ క్షణంలో అక్కడి హిమపాతంపై ఒంటె స్పందించిన తీరు మాటల్లో వర్ణించలేనిది.

చిన్న పిల్లలాగా ఆ మంచు ప్రాంతంలో ఆ ఒంటె గెంతులు చూస్తే మనకి కూడా మన చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.

ప్రస్తుతం ఆ వీడియో సైబర్ ప్రపంచంలో వైరల్ అవుతోంది.వందలాది జంతువుల కోసం వ్యవసాయ, జంతు అభయారణ్యం అయిన రాంచో గ్రాండే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా వెలుగు చూసింది.

"""/"/ కాగా, ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.ఆల్బర్ట్ అనే ఒంటె తొలిసారిగా మంచులోకి ప్రవేశించినట్లు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.

ప్రపంచంలో వున్న ఆనందం అంతా తాను ఒక్కటే అనుభవించినట్టు ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో చూడండి.

ఒంటె ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది.మంచును చూసిన ఒంటె ఒక్కసారిగా దూకడం, పరిగెత్తడం ప్రారంభిస్తుంది.

మంచును చూసిన ఆనందంలో ఒంటే ఇలా చేసిందని అర్థం చేసుకోవచ్చు.అక్కడ ఒంటెతో పాటు మేకల మంద కూడా ఉంది.

"""/"/ ఇకపోతే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్టు చేస్తూ.ఒక శీర్షిక జోడించారు.

దాని సారాంశం ఇలా వుంది.మేము దీన్ని టిక్‌టాక్‌లో పోస్ట్ చేయగా అక్కడ చాలామంది దీన్ని ఇష్టపడినట్లు అనిపించింది.

ఆల్బర్ట్ కూడా అదే ఫీల్ అయ్యాడు.కాబట్టి మేము దీన్ని ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులతో పంచుకోవాలని భావించాము.

అందరూ ఆదరించినందుకు కృతజ్ఞతలు అంటూ.టెక్స్ట్ రాసుకొచ్చారు.

ఇక వీడియో చూసిన నెటిజన్లు అయితే వారి అనుభూతిని కామెంట్స్‌ రూపంలో తెలిజేస్తున్నారు.

అక్రమ వలసదారుల ఏరివేత .. యాక్షన్‌లోకి ట్రంప్, గురుద్వారాలలో యూఎస్ ఏజెంట్ల తనిఖీలు