యూట్యూబ్ లో రెండు గంటల వీడియో.. ఏం చేయకున్నా మిలియన్ల వీక్షణలు!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో ఏమి చెయ్యకపోయినా పాపులర్ అయిపోతున్నారు.అదేంటో మరి.
కొందరు పాపులర్ అయ్యేందుకు ఎంతో కష్టపడుతుంటారు కానీ అవ్వరు.కొందరు మాత్రం ఏమి చెయ్యకపోయినా సరే పాపులర్ అయిపోతారు.
ఇంకా అలానే ఓ యూట్యూబర్ వీడియోని చిత్రీకరించాడు.ఆ వీడియో చూస్తే అసలు షాక్ అయిపోతారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.సాధారణంగా ఒక కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని వీడియోల తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తే వైరల్ కాదు కదా! అసలు వీడియో ఎవరు చూడరు.
కానీ ఇండోనేషియన్ చెందిన ఓ యూట్యూబర్ ''2 గంటలపాటు ఏం చేయకుండా ఉండటం ఎలా'' అనే పేరుతో వీడియోను చేశాడు.
ఇంకా ఆ వీడియోలో వ్యక్తి రెండు గంటల పాటు ఖాళీగా కూర్చున్నాడు.అవును.
ఊరికే కెమెరాను తదేకంగా చూస్తూ రెండు గంటలు కూర్చున్నాడు.ఆ వీడియోను జులై 10వ తేదీన విడుదల చెయ్యగా దానికి ఇప్పటికి ఏకంగా 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
షాకింగ్ గా ఉంది కదా! ఇంకా ఈ వీడియో చెయ్యడానికి ఒక కారణం కూడా ఉందట.
అదేంటంటే? అతను రోజు చేసే వీడియోల కింద యువతకు ఉపయోగపడే వీడియోలు చెయ్యాలని సూచిస్తున్నట్టు అందుకే ఆ వ్యక్తి ఇలా చేసినట్టు చెప్పాడు.
దీని వల్ల ఉపయోగం ఏముందని ప్రశ్నించగా అది మీకే తెలియాలి.ఇప్పుడు ఉన్న యువత 24 గంటలు ఇదే పని చేస్తుంది అంటూ అతను చెప్పుకొచ్చాడు.
నిజానికి ఈ సమాదానాలు కామెడీగా అనిపించినప్పటికీ ఇది నిజం అని ఆ వీడియో కింద కామెంట్లు చూస్తే తెలుస్తుంది.
మీరు కూడా ఓసారి ఈ వీడియోను చూసేయండి.
గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ సంచలన వ్యాఖ్యలు… సంతృప్తిగా లేదంటూ?