వైరల్ వీడియో: బైక్ స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకులు..!

ప్రస్తుతం ఉన్న రోజులలో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ పెంచుకోవడానికి చాలా మంది యువత అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

వారి ఫాలోయింగ్ కోసం వివిధ రకాల ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ఇలా వివిధ ప్రమాదకరమైన ప్రయత్నాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

ఒక వైపు పోలీసు అధికారులు కూడా ప్రమాదకరమైన ప్రయోగాలు చేయవద్దు అంటూ యువతకు ఎన్నిసార్లు హెచ్చరించిన కానీ, వారు మాత్రం వారి తీరును మార్చుకోరు.

ప్రస్తుతం ఇద్దరు యువకులు బైక్ పై చేసిన ప్రమాదకరమైన స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఈ వీడియో ఆధారంగా ఒక ఇద్దరు యువకులు బైక్ పై ప్రమాదకరంగా స్టంట్ చేయడం మనం గమనించవచ్చు.

ముందుగా వెనుక కూర్చున్న యువకుడు బైక్ చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఉండగా ముందు ఉన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు.

రన్నింగ్ లో బైక్ పై నుంచి దిగడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా అదుపు తప్పి కింద పడిపోతాడు.

ఈ క్రమంలో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కూడా బండితో సహా రోడ్డుపై పడి పోయాడు.

ఇందుకు సంబదించిన వీడియో ఒకటి ఐపీఎస్ ఆఫీసర్ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ జీవితం ఒకే సారి వస్తుంది మళ్ళీ రాదు మీ మూర్ఖత్వంతో మీ నిండు జీవితాన్ని వృధా చేసుకోకండి అంటూ కాప్షన్ ను జత చేశారు.

ఈ వీడియో ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ వారి రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసేయండి.

పక్క ఇండస్ట్రీ డైరెక్టర్లు మన హీరోలతో సినిమాలు చేయడానికి కారణం ఏంటి..?