వైరల్ వీడియో : ఒకే చొక్కాతో 264 జూమ్ మీటింగ్స్...!

ప్రపంచంలో కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవనశైలి పూర్తిగా మారిపోయింది అనే చెప్పాలి.

అంతేకాకుండా ప్రతి ఒక్కరి ఆఫీస్ పనుల నుంచి వారి రోజూ వారి విధానంలో పూర్తిగా అనేక మార్పులు చేసుకున్నారు.

మొదటిలో ఇంటి దగ్గరే ఉండి పని చేయడం చాలా ఇబ్బంది కరంగా మారిందనే చెప్పాలి.

ఆన్లైన్ మీటింగ్ లో పాల్గొనడం, దాని కోసం ఇంటి వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం లాంటివి.

అయితే చాలా మందికి కొన్ని రోజుల అనంతరం ఇది సర్వసాధారణం అయిపోయింది.ఈ తరుణంలో మనం నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో చిత్ర విచిత్రాల జూమ్ ఆన్లైన్ మీటింగ్స్ మనం చూస్తూనే ఉన్నాం.

అంతేకాకుండా ఎన్నో రకాల మీమ్స్ రావడం, వాటిల్లో ఫన్నీ ఉండడంతో పాటు చాలా ఆశ్చర్యానికి కూడా గురి చేశాయి.

అచ్చం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక మహిళ ఇప్పటివరకు 264 జూమ్ సమావేశాలలో ఒకే చొక్కా ధరించి మరి మీటింగ్స్ లో పాల్గొనడం జరిగింది.

అయితే ఈ విషయాన్ని ఆమె పని చేసే కంపెనీలో ఎవరు కూడా గమనించలేదు అంటే నమ్మండి.

గడిచిన 15 నెలల్లో ప్రతి సమావేశానికి కూడా ఆ మహిళ పువ్వులు, పైనాపిల్ తో డిజైన్ చేసి ఉన్న నీలి రంగు చొక్కా ధరించి మీటింగ్ లలో పాల్గొందట.

ఈ విషయాన్ని స్వయంగా ఆ మహిళ కంపెనీ సిబ్బందికి చెప్పినప్పుడు ఆమె ఏమి చెప్పిందో ఎవరికి కూడా అర్థం కాలేదని తెలుస్తుంది.

"""/"/ అయితే ఆమె అలా ఒకే చొక్కా ధరించి మీటింగ్ లలో పాల్గొనడం కనీసం ఒక వ్యక్తి అయినా గమనిస్తారేమో అని ఆశించిన కానీ, ఎవరు గమనించక పోయేసరికి నేరుగా ఆమె కంపెనీ యాజమాన్యం వారితో తెలియజేసింది.

ఇందుకు సంబంధించి ఆమె మాట్లాడుతూ.“ఈ రోజు నేను ఈ చొక్కా ధరించిన 264 వ సమావేశం.

ఇది పనిలో నా చివరి రోజు.నేను అదే చొక్కా ధరించి ఉన్నానని నా బృందానికి చెప్పినప్పుడు, నేను ఏమి మాట్లాడుతున్నానో వారికి అర్థం కాలేదు.

వారు గమనించలేదు.” అంటూ పేర్కొంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

2025 స్ట్రీమింగ్ సినిమాలను ప్రకటించిన నెట్ ఫ్లిక్స్.. ఓజీ, మాడ్ స్క్వేర్ తో పాటు ఆ సినిమాలు!