పిచ్చి పరాకాష్ట.. రీల్స్ చేయడంకోసం చీరను కాల్చుకున్న మహిళా
TeluguStop.com
ప్రస్తుత రోజుల్లో రీల్స్( Reels ) చేయడం చాలామందికి వ్యసనంగా మారింది.రీల్స్ వ్యూస్ కోసం చాలా క్రేజీ పనులు చేస్తుంటారు.
ఈ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు.లేదా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు.
ఇప్పటికే ఇలాంటి వీడియోలు చాలా సోషల్ నెట్‌వర్క్‌లలో వైరల్‌గా మారాయి.అలాంటిదే మరో వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
ఆ వీడియో కోసం ఆ మహిళ తన చీరకు( Saree ) నిప్పు అంటించుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ నెట్‌వర్క్‌లలో వీడియో వైరల్‌గా మారింది """/" /
ఇకపోతే వైరల్ వీడియోలో,( Viral Video ) ఒక మహిళ షెడ్‌లోని పొయ్యి వద్దకు వెళ్లి తన చీరకు నిప్పు అంటించుకుంది.
చీరకు మంటలు( Fire ) అంటుకోవడంతో పెద్దగా కేకలు వేసింది.అయితే కొద్ది క్షణాల తర్వాత మంటలు ఆరిపోయాయి.
ఆమె అరుపులు విన్న అక్కడి వారు మంటలు ఆర్పేందుకు పరుగున వచ్చారు.వెంటనే కట్టుకున్న ఆ చీరను తన తీసి పడేసింది.
ఓ వ్యక్తి ఈ ఘటన మొత్తాన్ని కెమెరాలో వీడియో తీశాడు.ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
"""/" /
వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల సంఖ్యలో వీక్షించారు.ఈ వీడియోను వందలాది మంది లైక్స్, కామెంట్స్ చేశారు.
ఈ వీడియో చూసిన ఎవరికీ వారు భిన్నంగా స్పందించారు.ఇందులో భాగంగా.
కొందరు “ఇది పిచ్చి యొక్క పరాకాష్ట” అని అంటుండగా.మరికొందరేమో.
రీల్స్ కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధమవుతున్నారని కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే ఏకంగా.
"వీరిని మానసిక వైద్యుడిని చూపించాలని" కామెంట్ చేసారు.ఏదిఏమైన ప్రజలను ఆకర్షించాలంటే వీడియోలు చేయాలి కాని చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు.
కంటి ఆరోగ్యానికి అండగా ఉండే ఈ ఆహారాలు మీరు తింటున్నారా..?