రిక్షా పుల్లర్‌కు సహాయం చేసిన మహిళ.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..

ఈ ప్రపంచంలో చెడ్డ వారు మాత్రమే కాదు అడగకపోయినా ఇతరులకు సహాయం చేసే మంచి వాళ్లు కూడా ఉంటారు.

వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.తాజాగా మరొక ఒక హార్ట్ టచింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో, ఒక మహిళ మండే ఎండల రోజున రిక్షావాలాకు( Rickshaw Puller ) సహాయం చేస్తుంది.

"""/" / ఈ మహిళ ఒక ట్రాలీ రిక్షా వెనుక పరుగులు తీస్తుంది.

రిక్షావాలా ఒక పెద్ద AC కార్ట్‌ను ఒక ఫ్లైఓవర్‌పైకి నెట్టడానికి కష్టపడుతున్నాడు.మహిళ( Woman ) సహాయం చేయడానికి ముందుకు వచ్చి, అతడికి భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.

అలసట వల్ల, ఆమె తన స్నేహితుడిని సహాయం( Help ) కోసం పిలుస్తుంది.

వారు కలిసి భారీ కార్ట్‌ను ఈజీగా ఫ్లైఓవర్ ఎక్కిస్తారు.డ్రైవర్‌కు సహాయం చేసిన తర్వాత, మహిళ కార్ట్‌ను( Cart ) ఆపి, అతనికి ఫుడ్ బాక్స్, వాటర్ బాటిల్‌ను అందిస్తుంది.

"""/" / చాలా మంది ఈ మహిళ చాలా దయ చూపించారంటూ ప్రశంశాలు కురిపిస్తున్నారు.

కొందరు ఆమె చర్య ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ఉందని పేర్కొన్నారు.మరికొందరు మనం అవసరమైన వారికి ఎల్లప్పుడూ సహాయం చేయడానికి ముందుకు రావాలని గుర్తు చేశారు.

ఈ వీడియో మనకు ఇచ్చే ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే చిన్న చిన్న సహాయాలు కూడా గొప్ప తేడాను కలిగిస్తాయి.

ఈ వీడియో ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు, కానీ చాలా మంది దీనిని షేర్ చేసి, దాని గురించి మాట్లాడుతున్నారు.

ఈ వీడియోకు 5 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.

బ్రేక్‌ఫాస్ట్ లో బ్రెడ్ తింటున్నారా.. అయితే మీ ఆరోగ్యం ఖ‌తం!