వైరల్ వీడియో: భర్త అంటే ఇంత ప్రేమ ఉండి, ఎందుకు విడాకులు?

వైరల్ వీడియో: భర్త అంటే ఇంత ప్రేమ ఉండి, ఎందుకు విడాకులు?

భారతదేశంలో వివాహ వ్యవస్థ(Marriage System In India) అత్యంత గొప్ప సంప్రదాయం.పెళ్లి కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల మధ్యన ఏర్పడే మైత్రి బంధం కూడా.

వైరల్ వీడియో: భర్త అంటే ఇంత ప్రేమ ఉండి, ఎందుకు విడాకులు?

మూడుముళ్లతో ఒకటైన భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాలని ప్రతిజ్ఞ చేస్తారు.ఏకాంతం, ప్రేమ, నమ్మకం, సమన్వయం పెళ్లి బంధాన్ని(Solitude, Love, Trust, And Harmony Make Up The Bond Of Marriage.

వైరల్ వీడియో: భర్త అంటే ఇంత ప్రేమ ఉండి, ఎందుకు విడాకులు?

) మరింత బలంగా ఉంచుతాయి.గతంలో దాంపత్య జీవితం సాఫీగా సాగేందుకు భార్యభర్తలు పరస్పరం రాజీ పడేవారు.

గొడవలు జరిగినా, విడిపోవాలనే ఆలోచనను ఎవరూ తెచ్చుకోలేదు.పిల్లల భవిష్యత్తు కోసం, కుటుంబ సమైక్యత కోసం ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఓర్చుకునేవారు.

కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.చిన్న చిన్న విషయాలకే గొడవలు పెద్దవిగా మారుతున్నాయి.

ఒకరి మీద ఒకరు పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు.ఓపిక, సహనం, రాజీ పడే తత్వం(Patience, Tolerance, And A Spirit Of Compromise) తగ్గిపోయాయి.

చిన్న గొడవలు పెరిగి విడాకుల వరకూ తీసుకెళ్తున్నాయి.కొన్నిసార్లు, ఈగో సమస్యలు పెరిగి కోర్టుల వరకు చేరతాయి.

ఇదే తరహాలో ఓ దంపతుల కేసు కోర్టులో విచారణకు వచ్చింది.అయితే అక్కడ జరిగిన పరిణామాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2025/03/viral-video-why-orce-if-you-love-your-husband-so-much-a!--jpg" / కోర్టుకు విచారణకు వచ్చిన ఓ జంట చిన్న చిన్న గొడవల కారణంగా విడాకులకు దరఖాస్తు చేసుకుంది.

భార్య తనను భర్త సరిగా చూసుకోవడం లేదని న్యాయమూర్తికి చెప్పింది.అయితే, ఆమె మాటల్లో భర్తపై ప్రేమ ఇంకా ఉందని జడ్జి గమనించాడు.

విడాకుల కోరిక ఉన్నప్పటికీ, ఆమె భర్తను పూర్తిగా వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లు తెలిసింది.

దీంతో జడ్జి వారిని మళ్లీ కలిపేందుకు ఓ ఆసక్తికరమైన ప్రయత్నం చేశారు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2025/03/viral-video-why-orce-if-you-love-your-husband-so-much-b!--jpg" / ఇందులో భాగంగానే "మీ భర్త మంచి సింగర్ అంట కదా?" అని జడ్జి ప్రశ్నించారు.

"అవును, పాటలు బాగా పాడతారు" అని భార్య సమాధానమిచ్చింది.దీనితో జడ్జి భర్తను పాట పాడమని కోరారు.

వెంటనే భర్త "జీనా జీనా"("Gina Gina") పాటను ఆలపించాడు.ఆ పాట విన్న వెంటనే భార్య భావోద్వేగానికి లోనైంది.

నెమ్మదిగా భర్త భుజంపై వాలిపోయింది.దాంతో అక్కడున్న వారంతా చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు.

చివరకు ఇద్దరూ విడాకుల ఆలోచనను విరమించుకున్నారు.జడ్జి వారి కలయికను ఆశీర్వదించారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.కొందరు దీన్ని సరదాగా తీసుకుంటే, మరికొందరు కావలెనే చేసారని భావిస్తున్నారు.

రాబిన్ హుడ్ టికెట్ ధరల పెంపుపై క్లారిటీ ఇదే.. ఆ వార్తల్లో నిజం లేదంటూ?

రాబిన్ హుడ్ టికెట్ ధరల పెంపుపై క్లారిటీ ఇదే.. ఆ వార్తల్లో నిజం లేదంటూ?