వైరల్ వీడియో... వారెవ్వా... కరోనాపై ఇలా కూడా అవగాహన కల్పించవచ్చా

ప్రస్తుతం కరోనా దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.మొదటి దఫా కరోనాలో కేసులు భారీగా నమోదైనా మరణాలు మాత్రం పెద్దగా సంభవించలేదు.

కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకర రీతిలో విజరుంభిస్తున్నందున ప్రభుత్వాల నుండి మొదలు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి అనే ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు ప్రజలకు కరోనా నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తూనే ఉన్నారు.

అయితే ఇంకా కరోనాను ఏ మాత్రం ఖాతరు చేయకుండా యథేచ్ఛగా కర్ఫ్యూ విధించినా, లాక్ డౌన్ విధించినా నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు.

,/br అయితే కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుంటున్నారు.

సెలెబ్రేటీలు అయితే తమ సామాజిక మాధ్యమాల ద్వారా, టీవీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

కాని మీరిప్పుడు చూడబోయే వీడియోను చూస్తే కరోనా పట్ల ఇలా కూడా అవగాహన కల్పించవచ్చా అని ఆశ్చర్యపోక మానరు.

మీ ఇంట్లోనే ఉండండి.దయచేసి బయటకు రావద్దు అని ఓ వాహనం మీద ప్లకార్డులతో చూపిస్తూ పాట ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

ఇక పాటల ద్వారా కరోనా భయాన్ని వివరిస్తూ ఈ అవగాహన సాగింది.ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తికరంగా తిలకిస్తున్నారు.

వైరల్: అరటిపండును ఇలా ఎపుడైనా తిన్నారా? అమ్మబాబోయ్!