వీడియో: తాత కిల్లర్ స్టెప్పులు.. ఆ పాటకు డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేశాడంతే!
TeluguStop.com
ప్రస్తుతం భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.సోషల్ మీడియా మొత్తం డ్యాన్సులు, డెకరేషన్లతో కళకళలాడుతోంది.
ఈ నేపథ్యంలోనే ఒక కొత్త వీడియో వైరల్( Viral Video ) అవుతూ సందడి చేస్తోంది.
అందులో ఒక వృద్ధుడు( Elderly Man ) పెళ్లిలో యమా జోష్‌తో డ్యాన్స్ చేస్తూ అదరగొడుతున్నాడు.
వైరల్ వీడియోలో, సదరు తాత 2010లో వచ్చిన 'కార్తీక్ కాలింగ్ కార్తీక్' సినిమాలోని 'ఉఫ్ తేరి అదా' పాటకు( Uff Teri Adaa Song ) దుమ్మురేపుతూ స్టెప్పులేశాడు.
"""/" /
కొంతసేపటికి ఇంకో పెద్దాయన కూడా రంగంలోకి దిగాడు.ఇక అంతే, 'ధడక్' సినిమాలోని 'జింగాట్' పాటకు ఆయన వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
"ఇలా డ్యాన్స్( Dance ) చేసే బంధువు ఒకరైనా మన ఫ్యామిలీలో ఉంటారు" అంటూ ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్ అయిపోయింది."డ్యాన్స్ అంటేనే ఎమోషన్స్‌ని చూపించడం.
దాన్ని జడ్జ్ చేయకూడదు.ఈ తాతల డ్యాన్స్ నాకు బాగా నచ్చింది.
" అని ఒక యూజర్ కామెంట్ పెట్టారు."ఈ అంకుల్స్ వాళ్ల కూలెస్ట్ యాంగిల్ చూపిస్తున్నారు" అని ఇంకొకరు రాశారు.
"వాళ్లు ఎంజాయ్ చేసిన విధానం నిజంగా క్యూట్‌గా ఉంది" అని మరొకరు కామెంట్ చేశారు.
"""/" /
చాలామంది ఈ తాతయ్య డ్యాన్స్ మూవ్స్‌కి ఫిదా అయిపోయారు.ఒక యూజర్ అయితే ఏకంగా "ఇండియన్ మైఖేల్ జాక్సన్" అని పొగిడేశాడు.
"బ్రేక్‌డ్యాన్స్ ఎప్పటినుంచో ఉందిలెండి." అని ఇంకొకరు సరదాగా కామెంట్ చేశారు.
"అదే స్పిరిట్, ఎవరూ చూడనట్టు డ్యాన్స్ చేయండి" అని ఒక వ్యక్తి ఎంకరేజ్ చేశారు.
"ఇంత ఫన్ లవింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండడం నిజంగా గ్రేట్.సూపర్బ్.
" అని ఇంకొకరు కామెంట్ చేశారు.ఈ వీడియోకి ఇన్‌స్టాలో ఇప్పటికే 1.
4 మిలియన్ వ్యూస్, దాదాపు 50 వేల లైకులు వచ్చాయంటే మామూలు విషయం కాదు.
నీ రుణం ఎప్పటికీ తీరదు… వడ్డీకైనా ప్రేమిస్తా… రచ్చ రవి పోస్టు వైరల్!