వైరల్ వీడియో: ఓ కంటైనర్‌లో రెండు తలల పాము ప్రత్యక్షం…!

ఈ మధ్యకాలంలో ప్రపంచం నలుమూలలా ఏమి జరుగుతుందో, ఎలాంటి కొత్తకొత్త సంఘటనలు సంభవిస్తున్నాయో ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ క్షణాల్లో సోషల్ మీడియా పుణ్యమా అంటూ తెలిసిపోతుంది.

ఏదైనా సంఘటనకు సంబంధించి ఫోటోలు లేదా వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ద్వారా అందులో కొన్ని వీడియోస్ తెగ వైరల్ గా మారిపోతున్నాయి.

మరిముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.ఇకపోతే తాజాగా ఇంట్లో కనిపించిన పాము కు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని వీడియోల వల్ల పాములు ఎన్ని రకాలు ఉంటాయి, ఎలాంటి పాములు ఎక్కడ ఉంటాయి అన్న విషయాలు ప్రజలకు తెలుస్తోంది.

అయితే తాజాగా ఓ మహిళ తన ఇంట్లో రెండు తలలు ఉన్న పామును గుర్తించింది.

రెండు తలలు ఉన్న పామును గుర్తించడంతో ఆశ్చర్యపోయిన ఆవిడ వెంటనే ఆ పాముకు సంబంధించి వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

రెండు తలల పాము కావడంతో ఈ వీడియో కాస్త బాగా వైరల్ గా మారింది.

ఇక ఈ పామును నార్త్ కరోలినాప్రాంతానికి చెందిన జెన్నీ విల్సన్ కనుగొనింది.తన ఇంట్లో ఉన్న ఓ కంటైనర్లలలో చెత్త క్లీన్ చేస్తున్న సమయంలో ఆమె ఈ పామును కనుగొనింది.

అయితే ఆ పాము అందులోకి ఎలా వచ్చిందో ఆమెకు నిజంగా అర్థం అవ్వట్లేదు.

ఇక ఈ వీడియోలో.ఆ పాము కదిలేందుకు ఆవిడ కంటైనర్ లో ఉన్న గడ్డిని తొలగిస్తూ ఉంది.

ఈ వీడియోను ఆవిడ ' డబుల్ ట్రబుల్' అని పిలవ సాగింది.అయితే ఆమెకు నెటిజన్స్ ఆ పాము విషపూరితమైనది అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, వీలైనంత త్వరగా దానిని ఎక్కడైనా అడవి ప్రాంతంలో వదిలేయమని సూచనలు ఇస్తున్నారు.

రూ.100లోపే ఇల్లు కొనేసింది.. ఇప్పుడు ఆ ఇంటి లుక్కు చూస్తే ఆశ్చర్యపోతారు..