వైరల్ వీడియో: ఒక్క క్షణం సమయం చాలా విలువైందంటే ఇదే కాబోలు సుమీ!

మన జీవితంలో అద్భుతంగా అదృష్టం కలిసివస్తే, ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరికీ ఎలాంటి నష్టం జరగదు.

అదే సమయంలో, మన అదృష్టం నడవకపోతే.చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా ప్రాణ నష్టం సంభవిస్తుంది.

ఈ తరహా ప్రమాదాలు, ఆ క్షణం విలువను చెప్పే ఘటనలకు సంబంధించిన వీడియోలను మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.

తాజాగా, అచ్చం ఇలాంటి ఓ షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో చోటు చేసుకుంది.

అక్కడ వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో కొన్ని రోజులుగా కులులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్లు, పంట పొలాలు నీట మునిగాయి.

మరోవైపు, కొండచరియలు విరిగిపడటం అక్కడి వాసులు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో కులులోని ఓ ఘాట్ రోడ్డులో వాహనాలు వెళ్లే సమయంలో ఒక్కసారిగా భయానక ఘటన చోటు చేసుకుంది.

కొండచరియలు కూలిపోతాయేమో అనే అనుమానంతో కొందరు వాహనదారులు తమ వాహనాలను రోడ్డు పక్కన ఆపుకున్నారు.

కానీ, ఓ కారు యజమాని మాత్రం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.కారు కాస్త ముందుకు వెళ్ళగానే ఆ కారుకు ముందే కొండచరియలు విరిగి పడిపోయాయి.

ఒక్క క్షణం ముందే కారు వెళ్లి ఉంటే, అది నుజ్జునుజ్జయ్యేదని అక్కడ ఉన్నవారు భయంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇది క్షణం విలువను తెలియజేసే వీడియోగా నెటిజన్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు."క్షణ కాలం ఆలస్యం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది" అని కొందరు కామెంట్ చేయగా.

"నీకు అదృష్టం చాలా ఉంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. """/" / నిజానికి అది కేవలం అదృష్టం అనే చెప్పాలి.

కారు యజమాని ముందుకు వెళ్ళడం, కొండచరియలు కూలిపోవడం కేవలం క్షణాల్లోనే జరిగిపోయింది.ఈ సంఘటనను చూసిన వారంతా ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి చూశారు.

చివరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.మొత్తం మీద, ఈ వీడియో మనకు అదృష్టం, క్షణం విలువను అర్థం చేసుకునేలా చేస్తోంది.

ప్రమాదాలను ముందుగానే గుర్తించడం, వాటికి తగ్గ సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మనకు తెలియజేస్తోంది.