వైరల్ వీడియో: కొత్త స్టైల్ లో ఇంట్లో చోరీలకు తెగబడ్డ దొంగలు..
TeluguStop.com
ప్రస్తుత రోజుల్లో దొంగలు( Thefts ) కూడా బాగా చేంజ్ అయ్యారు.దొంగలు అనేక నేరాలకు పాల్పడేందుకు సరికొత్త పద్ధతిని ఎంచుకుంటున్నరు.
ప్రస్తుత రోజులలో దొంగలు కూడా మంచిగా రెడీ అయ్యి సూట్లు, బూట్లు, టైలు వేసుకుని దర్జాగా వచ్చి రాత్రి పగలు అన్న తేడా లేకుండా చోరీలకు, దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు.
అచ్ఛం అలాగే తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీ వీవీఐపీ ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ( Apartment In The VVIP Area )దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.
"""/" /
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.గోండా పోలీస్ స్టేషన్( Gonda Police Station ) పరిధిలోని కంకే రోడ్ లోని ఓ ప్రముఖ కాంట్రాక్టర్ గా పని చేస్తున్న వ్యక్తి ఇంట్లోకి పట్టపగలు దొంగలు ఇంట్లోకి చొరబడి మరి రూ.
30 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకోని వెళ్లారు.అయితే, ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఆ దొంగల గెటప్ చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
"""/" /
సంఘటనకు సంబంధించి పోలీసు అధికారులు( Police Officers ) తెలిపిన వివరాల ప్రకారం.
గోండా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఒక కాంట్రాక్టర్ యశ్వంత్ సింగ్ ఇంట్లో పట్టపగలు చోరీ జరిగింది.
ఈ క్రమంలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, సంఘటన సమయంలో తాను పని మీద బయటకు వెళ్ళాను అని, అతని భార్య ఇంటికి తాళం వేసి పనిమీద బయటికి వెళ్లినట్టు తెలిపాడు.
వారు ఇద్దరు ఇంటికి రాకముందే ఒక ఇద్దరు వ్యక్తులు అతని ఇంటికి చేరుకుని ఇంటికి వేసిన తాళం పగులగొట్టి రూ.
30 లక్షలకు పైగా విలువైన వస్తువులను దొంగతనం చేసినట్టు తెలిపారు.ఇది అంత కూడా ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదు అయ్యినట్టు తెలుస్తోంది.
ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ సీసీ ఫుటేజీలో దొంగలిద్దరూ కార్పొరేట్ అధికారుల్లా సూట్లు, బూట్లు, టైలు ధరించి ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు.
ఇది ఇలా ఉండగా.మరొకవైపు రాజధాని రాంచీలో నెల వ్యవధిలో ఇది వరుసగా మూడో అతిపెద్ద దొంగతనం అని పోలీసులు కూడా తెలిపారు.
అయితే, ఇప్పటి వరకు జరిగిన నేరాల్లో అతని వాదన కేవలం కాగితాలపై మాత్రమేనని తేలింది.
డాకు మహారాజ్ రివ్యూ & రేటింగ్