రైలు ప్రయాణాలలో జరభద్రం సుమీ.. లేకపోతే సమస్యలు తప్పవు!(వీడియో)
TeluguStop.com
ప్రస్తుత రోజులలో చిన్న పిల్లవాడు నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ నిత్యం వారి రోజువారి పనులలో చాలా మంది ఫోన్ లో వారి సమయానికి గడపే వారు ఉన్నారు.
మనలో ఎవరైనా సరే చాలా వరకు బస్సులో రైలు, ఆటోలలో ప్రయాణం చేస్తున్న సమయంలో సెల్ ఫోన్ చూడడం సర్వసాధారణం.
ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి.గతంలో కూడా ఒకసారి రైల్లో( Train ) ప్రయాణిస్తున్న వారు ఒకరు సెల్ఫోన్లు చార్జింగ్ పెట్టి ఉన్న క్రమంలో ఆ ఫోన్ ను దొంగతనం( Stealing Mobile ) చేసిన సంఘటన వైరల్ గా మారింది.
అయితే, ప్రస్తుతం అచ్చం అలాగే ట్రైన్ లో ప్రయాణం చేస్తూ సెల్ఫోన్ లో గేమ్ ఆడుతున్న ఒక చిన్నారికి అనుకోని సంఘటన ఎదురయింది.
"""/" /
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.
రాత్రి సమయంలో ఏదో ఒక ప్రముఖ స్టేషన్లో రైలు ఆగి ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే, విండో సీట్ లో ఇద్దరు అమ్మాయిలు కూర్చొని సరిగ్గా కిటికీ దగ్గర ఒక అమ్మాయి కూర్చొని వీడియో చూస్తుంటే.
ఆ రైలు అప్పుడే స్టార్ట్ అవుతూ ఉండగా ప్లాట్ఫారం నుంచి ఒక గుర్తుతెలియని వ్యక్తి కదులుతున్న రైల్లో ఆ చిన్నారి చేతిలో ఉన్న ఫోన్ ని బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు.
"""/" /
ఇంతలో ఆ చిన్నారి అరవడం కూడా మొదలు పెట్టింది."మమ్మీ నా ఫోన్ నా ఫోన్ అంటూ నా ఫోన్ వదిలి వేయండి " అంటూ గట్టిగా అరుస్తుంది.
కానీ., ఆ దొంగను ( Thief ) అడ్డుకోవడం ఆ చిన్నారికి కుదరలేదు.
చివరికి ఆ దొంగ ఆ చిన్నారి నుంచి ఫోన్ లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు.
ఇక ఈ వీడియో ను చూసిన కొంతమంది వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
ప్రజా రవాణాలో భద్రతపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి అంటూ కామెంట్ చేస్తూ ఉండగా.
అలాగే మరికొందరు "రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
రుణమాఫీపై తీపి కబురు అందేనా…?