వైరల్ వీడియో: యువతపై సడన్ గా ఎటాక్ చేసిన పాము.. చివరికి..?!

పాము పేరు చెబితే చాలు మనలో చాలా మంది ఆమడ దూరం పరిగెత్తుతారు.

ఎందుకంటే పాము అనేది విషపు జీవి కాబట్టి పామును చూస్తే ఎవరికయినా వణుకు పుడుతుంది.

అయితే అన్ని పాములు విష సర్పాలు కావు.కొన్ని మాత్రమే విషాన్ని వెదజల్లుతాయి.

విష సర్పం అయినా విష రహిత సర్పం అయినా గాని ఏ పామును చూసిన ఆటోమేటిక్ గా భయం వచ్చేస్తుంది.

అడవిలో పాములు తిరుగతాయని తెలిసి అడవి వైపు వెళ్ళడానికి కూడా చాలామంది సాహసం చేయరు.

అవే పాములు ఇళ్లలోకి వస్తే ఎక్కడ తమకు హాని చేస్తాయో అని దానిని వెంటాడి వేటాడి మరి చంపేస్తారు.

అయితే ఒక్కోసారి మనం దారిలో వెళ్తుంటే ఉన్నటుండి పాము వచ్చి మన మీద దాడి చేస్తే, దానిని చూసి సడెన్ గా మన గుండె ఆగినంత పని అవుతుంది కదా.

సరిగ్గా ఈ యువతులకు కూడా అలాంటి ఒక విచిత్రమైన అనుభవమే ఎదురైయింది.వివరాల్లోకి వెళితే.

థాయిలాండ్‌లో గల అడవులలో కొందరు యువతులు సరదాగా ట్రెక్కింగ్ చేస్తున్నారు.అక్కడ గల కొండల, కొనల మీదగా చెట్లు, పొదలు దాటుకుంటూ పైకి వెళ్తున్నారు.

సరిగ్గా అప్పుడే ఒక పాము ఒక యువతీ వెళ్లడం చూసి పొదల్లోంచి అమాంతం పైకి లేచి ఆ యువతిని తన కొరలతో కాటేయటానికి చూసింది.

వెంటనే అప్రమత్తం అయిన ఆ యువతి వేగంగా పాము కాటు నుంచి తప్పించుకుంది.

ఈ ఘటన చూసిన మిగతా యువతులు భయంతో గట్టిగా కేకలు వేశారు.అయితే పాము దాడికి సంబందించిన ఘటన వెనుక నుంచి నడుచు కుంటూ వస్తున్న ఒక యువతి యొక్క ఫోన్లో కెమెరా ఆన్ చేసి ఉండడంతో వీడియోలో రికార్డయింది.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.కొందరు నెటిజన్లు అయితే ఆ పామును పట్టుకుని తినక పోయారా అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

వైరల్ వీడియో: ఇంస్టాగ్రామ్ రీల్ కోసం కదలే రైలుపై సాహసం.. చివరకు ప్రాణాలు..?