వైరల్ వీడియో: ప్రాణాలకు తెగించి ముసలి దగ్గరికి వెళ్లిన వ్యక్తి.. చివరకు..?!

ప్రస్తుత రోజుల్లో కొంతమంది కూర జంతువుల పట్ల నడుచుకునే తీరును చూసి కొంతమంది ఫారెస్ట్ అధికారులు, జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.

వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాటి దగ్గరికి వెళ్లి కొంతమంది చేసే విన్యాసాలను చూసి అందరూ ఒక్కోసారి ఆశ్చర్యానికి గురి అయితే, మరోసారి ఆందోళనకు గురవుతున్నారు.

అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

"""/"/ గుజరాత్ రాష్ట్రంలోని కర్జన్ చెరువు ఒడ్డున ఒక మొసలి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పంకజ్ పటేల్ అనే వ్యక్తి మొసలి దగ్గరికి వెళ్లి దండం పెట్టి ఆ తర్వాత దానితో మాట్లాడాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు.

విచారణలో భాగంగా ఖొడియార్ దేవత ప్రతిరూపమే మొసలి అని దానిని తాకడం అతడికి ఇష్టం అని తెలియజేశాడు.

ఇక వీడియో ఆధారంగా మొసలికి అతి దగ్గరిలో పటేల్ వెళ్లినట్లు స్పష్టంగా కనబడుతోంది.

అంతేకాకుండా మొసలి ని ముట్టుకొని దండం పెట్టి, ప్రాణాలకు ఏ మాత్రం భయపడకుండా అతి పెద్ద సాహసమే చేశాడు.

ఈ తరుణంలో ప్రజల నుంచి కాపాడతారని ముసలితో చెప్పాడు.ఈ సంఘటన చూసిన వారు అందరూ కూడా మొసలి దగ్గరకు వెళ్ళవద్దు దూరంగా ఉండు అని ఎన్నిసార్లు తెలిపిన కానీ, పటేల్ వారి మాట వినకుండా అలాగే వెళ్ళాడు.

అతని అదృష్టం బాగుందేమో కానీ మొసలి మాత్రం ఏమీ అతడని ఏమి అనకుండా చెరువులో కి వెళ్ళిపోయింది.

దీంతో అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నట్టుగా అయ్యింది.

ఇటీవల కాలంలో జంతువులతో పాటు ఇలా మొసళ్ల దగ్గరకు వెళ్లి వారికి చిరాకు తప్పించే పనులు చేస్తున్న తరుణంలో అటవీశాఖ అధికారులు ఈ విషయంపై చాలా సీరియస్ గా  ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఏం మార్పు వచ్చింది..: సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి ప్రశ్నలు