వీడియో వైరల్: ఏకంగా పాము కళ్లు పీకేసిన చిన్న పక్షి.. చివరికి..?!
TeluguStop.com
ఇటీవల జంతువుల వీడియోలు సోషల్ మీడియా( Social Media)లో బాగా వైరల్ అవుతున్నాయి.
జంతువులు ఒకదానిపై ఒకటి దాడి చేసుకునే వీడియోలు, ఒక జంతువు మరో జంతువుని చంపేయడం, మనుషులను జంతువులు తినేయడం లాంటి అనేక వీడియోలు నెట్టింట ఎక్కువగా చక్కర్లు కొడుతూ ఉంటాయి.
ఇటీవల పులిని గేదెలు కలిసి ఐకమత్యంతో చంపేసిన వీడియో తెగ వైరల్ అయింది.
తాజాగా అలాంటి ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక పాముతో పక్షి పోరాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
"""/" /
జంతువుల మధ్య జరిగే పోరాటాలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.పాముని గబ్బిలాలు, ముంగిసలు, గిన్నె కోళ్లు లాంటివి పొడిచి చంపేస్తూ ఉంటాయి.
కానీ ఒక చిన్న పక్షి పాము( Snake)తో పోరాడి విజయం సాధించింది .
లెట్స్ సిట్రర్ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో ఒక విషపూరితమైన పాముతో చిన్న పక్షి పోరాటం చేస్తోంది.తన ముక్కుతో పాము కళ్లను పీకేసింది.
దీంతో పాము కళ్ల నుంచి కర్తం పారుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.తన ముక్కుతో పాముని పొడిచి గాయపర్చింది.
"""/" /
పాము తప్పించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పక్షి వదిలిపెట్టలేదు.అలాగే దానిని పోడుస్తూ ఉంది.
సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఈ వీడియోకు 3.3 లక్షల వ్యూస్ వచ్చాయి.
అలాగే అనేక కామెంట్లు వస్తున్నాయి.పాముపై పక్షికి అంత కోపం ఎందుకుని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
ఆ పాము నోటిలో పక్షి గుడ్లు కానీ ఉన్నాయేమో అని, గుడ్లు తినేసిన పాముపై పక్షి( Bird ) పగ తీర్చుకుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇలా నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తోన్నారు.కానీ పాముపై ఈ చిన్న పక్షి పోరాడిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
పోరాడి పోరాడి చివరికి కళ్లు పీకేసింది.
కండోమ్ యాడ్ కు ఆ హీరోయిన్ పర్ఫెక్ట్ ఛాయిస్.. బిజినెస్ మేన్ కామెంట్లపై విమర్శలు!