వైరల్ వీడియో: అట్లుంటది మరి మనతోని.. ఉచిత బస్సును మాములుగా వాడట్లేదుగా..

ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం తెలంగాణ( Telangana )లో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారు చెప్పిన విధంగానే వచ్చిన కొద్ది రోజుల్లోనే మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది.

ఇక ఉచితంగా ప్రయాణం ఉండడంతో చాలామంది మహిళలు అవసరం ఉన్నా లేకున్నా అనేక ప్రాంతాలకు తెగ తిరిగేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి అనేక ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. """/" / ఉచిత బస్సు( Free Bus ) ప్రయాణం కారణంగా అనేక ప్రైవేట్ వాహనాలకు, అలాగే ఆటో వారికి సంబంధించి గిరాకీలు తగ్గిపోయాయి.

ఇక ముఖ్యంగా హైదరాబాద్( Hyderabad ) లాంటి మహానగరాలలో మెట్రోలాంటి సర్వీసులలో కూడా మహిళల ప్రయాణం పూర్తిగా తగ్గిపోయింది.

ఈ విషయాన్ని నేరుగా హైదరాబాద్ మెట్రో సంస్థనే తెలియజేసింది.అయితే ఈ మధ్యకాలంలో కొందరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ గొడవలకు దిగిన సంఘటనలు కూడా చాలానే చూసాము.

బస్సులోనే సీట్ల కోసం మహిళలు పోట్లాడుకుంటూ ఉన్న వీడియోలు చాలానే చూసాం. """/" / ఇకపోతే తాజాగా ఓ మహిళ బస్సులో ప్రయాణం చేస్తూ వ్యాపారం చేసిన సంఘటన కూడా వైరల్ అయింది.

సదరు మహిళ బస్సులో బెండకాయలను అమ్ముతూ ఉన్న వీడియోను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా( Social Media )లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

ఇక ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.హనుమకొండ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న బస్సులో ఇద్దరు మహిళలు ఇంట్లో చేయాల్సిన పనిని కాస్త బస్సులో ప్రయాణం చేస్తూ చేస్తున్నారు.

ఇద్దరు మహిళలు ప్రశాంతంగా సీట్లో కూర్చొని వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుంటూ ఉచిత ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియోకి నెట్టింట వైరల్ గా మారడంతో విశేష స్పందన లభించింది.

ఇక నేటిజన్స్ వారికి తోచిన విధంగా కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో నటించిన యంగ్ సెలబ్రిటీలందరూ సక్సెస్.. ఆ ఒక్కరు తప్ప..??