ఇదెక్కడి క్రియేటివిటీ నాయన.. పిల్లి లాంటి దోశ.. వీడియో వైరల్..!

వీధుల్లో అమ్మే ఫుడ్స్ తో పోల్చుకుంటే చాలా వెరైటీగా ఉంటాయి.అంటే ప్రతిచోట ఇలా ఉంటుందని కాదు కానీ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వెరైటీ ఫుడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కొత్త టేస్టులను అందించడానికి అలాగే కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకోవడానికి వంటగాళ్లు కొత్త రకం వంటలు చేసి వదులుతున్నారు.

అయితే ఒక్కోసారి ఈ వంటలను చూస్తే మనం స్టన్ అవ్వక తప్పదు.అలాంటి ఒక వంటకం ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇప్పుడు ఓ వీధి వ్యాపారి పిల్లి ఆకారంలో దోశను తయారు చేస్తూ నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తున్నాడు.

"""/"/ నాంది ఇండియా సీఈఓ మనోజ్ కుమార్ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఈ వీడియో ఓపెన్ చేయగానే వీధి వ్యాపారి దోశ పిండిని తవాపై పోసి తరువాత దానిని పిల్లిలా మలచడం చూడవచ్చు.

అతడు దోశను పిల్లి ఆకారంలో పోసి దాని కళ్ళు, నోరు ఆకారాన్ని కూడా తయారు చేశాడు.

అందుకోసం అదనపు పిండిని తొలగించాడు.అతను దోసెను మధ్యలో కట్ చేసి, అది ఉడికిన తర్వాత, దోసను తిప్పి, కస్టమర్ కోసం ఒక ప్లేట్‌లో నిటారుగా ఉంచాడు.

దాంతో అది అచ్చం పిల్లి లాగే తయారైంది.అయితే వీడియో ఎక్కడ తీశారో తెలియరాలేదు.

"""/"/ 'భారతదేశంలోని స్ట్రీట్ ఫుడ్ వెండార్స్ అత్యంత వినూత్నమైన ఆహారాలు తయారు చేస్తారు.

వారు చేసే ప్రతిదీ గౌర్మెట్ చెఫ్ కంటే అద్భుతంగానే ఉంటుంది.దయచేసి ఈ కుర్రాడి ఆర్ట్ స్కిల్స్ అభినందించండి.

' అని కుమార్ ట్వీట్ చేశారు.శనివారం నుంచి వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పటికే ట్విట్టర్‌లో 2.

1 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది.ఈ పిల్లి దోశ తయారు చేయాలని అతనికి వచ్చిన ఐడియాకి చాలామంది ఫిదా అవుతున్నారు.

దాన్ని క్రియేటివ్ గా ఆచరణలో పెట్టడం చూసి పోగొడుతున్నారు.మరికొందరు ఇదెక్కడి క్రియేటివిటీ నాయన అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై3, బుధవారం2024