వీడియో వైరల్: అరే ఏంట్రా ఇది.. మండపంలో పంతులుకి ఘోర అవమానం..

ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్లిలను ( Marriage ) అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.

ఖర్చుకు వెనకాడకుండా బంధు మిత్రులందరిని పిలుచుకొని పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.ఈ మధ్యకాలంలో అనేక రకాల పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం చూసే ఉంటాము.

అయితే అందులో పెళ్ళికొడుకు లేదా పెళ్లి కుమార్తెకు సంబంధించిన వార్తలు ఎక్కువగా చూస్తుంటాం.

ఇకపోతే తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే. """/" / ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో ఓ పంతులు( Priest ) పెళ్లి కార్యక్రమాన్ని స్టేజిపై నిర్వహిస్తున్నాడు.

ఇలా పెళ్లి మండపం పై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తరుణంలో కొత్త జంటని ఆశీర్వదించడానికి అక్షింతలను వేరే వారికి ఇస్తున్న సమయంలో.

అనుకోకుండా ఓ వ్యక్తి వచ్చి పంతులు తలపై ఓ ప్లాస్టిక్ బ్యాగును( Plastic Bag ) ఉంచి అక్కడి ఉంచి వెళ్లిపోయాడు.

దాంతో అసలు ఏం జరుగుతుందో అని అక్కడ ఉన్న వారందరూ షాక్ కు గురయ్యారు.

అయితే అంతటితో ఆగకుండా మంత్రాలు చదివే పంతులుపై కుంకుమ, పసుపు లాంటివి చల్లడం.

అలాగే కొత్త గుడ్డను ఆయన పైకి విసరడం లాంటి దుశ్చర్యలు చేశారు.దాంతో ఆ పంతులకు కోపం రావడంతో పెళ్లి పెద్దలని పిలిచి చెడమడ తిట్టేశారు.

"""/" / ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.అనేకమంది ఈ వీడియోపై స్పందిస్తున్నారు.

వేదమంత్రాలతో మన పూజా కార్యక్రమాలను, మంచి పనులకు సంబంధించిన కార్యక్రమాలను మొదలుపెట్టే వారిని ఇలా చేయడం ఎంతవరకు సబబు అంటూ కొందరు అంటుంటే.

మరికొందరైతే పెళ్లి జరిపించడానికి వచ్చిన పూజారీని ఇలా చేయడం ఏం భవ్యమంటూ కామెంట్ చేస్తున్నారు.

మరికొందరైతే పూజారికి జరిగిన అవమానాన్ని చూస్తే చాలా బాధేస్తుందని.అతడు శుభకార్యం చేసిన సమయంలో ఇలా చేయడం సరికాదంటూ నెటిజెన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ?