వైరల్ వీడియో.. జింకను చిరుత ఎంత క్రూరంగా వేటాడుతుందో చూడండి..
TeluguStop.com
అడవి జంతువుల జీవితం అంటేనే నిత్యం వేటతో కూడుకుని ఉంటుంది.ఎప్పుడు ఏ క్షనం నుంచి ప్రమాదం వచ్చి పడుతుందో చెప్పడం ఎవరి తరం కాదు.
ఎందుకంటే అడవిలో క్రూర మృగాల వేట ఎప్పుడూ ఓ సైలెంట్ యుద్ధంలాగే ఉంటుంది.
అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతం ఒక్క సారిగా భయంకరంగా మారి ప్రాణాలు తీసే సన్నివేశాలను తలపిస్తుంది.
రెప్ప పాటి వేగంలో కూడా ప్రాణాలు తీయగల భయంకర వేటగాళ్లకు అడవి పెట్టింది పేరు.
అలాంటి అడవిలో జీవించే జంతువుల్లో అత్యంత క్రూరంగా వేటాడగల జీవి చిరుత.అడవిలో జరిగే దాని వేట గురించి ఎంత చెప్పినా తక్కువే.
చిరుత వేగం అంటే ఏ జంతువు కూడా దాని నుంచి తప్పించుకోలేదనే చెప్పాలి.
దాని వేట ముందు ఎంతటి పెద్ద జంతువు అయినా కూడా ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు పెట్టాల్సిందే.
ఇక పోతే సాధు జంతువులు కూడా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు నిత్యం పరుగులు తీస్తూనే ఉంటాయి.
ఏ పొద నుంచి ఏ జంతువు తరుముకొస్తుందో తెలియదు.ఇలాంటి రణరంగంలో ఎప్పుడూ ముందుండే జంతువు చిరుత మాత్రమే.
ఇక ఇప్పుడు కూడా మనం చిరుత వేట గురించే మాట్లాడుకోబోతున్నాం. ""img Src=" "/
ఇక ఇప్పుడు కూడా చిరుత ఓ జింకను ఎలా వేటాడిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నిజానికి చిరుతలు కూడా ఎక్కువగా జింకలను వేటాడటం మనం చూస్తూనే ఉన్నాం.అయితే జింకలు కూడా బాగానే పరుగెత్తుతాయి.
చిరుతల తమ వేగానికి పని చెప్పాలని అనుకుంటాయో ఏమో గానీ స్పీడ్ గా పరిగెత్తే ఈ జింకలను వేటాడితేనే మజా వస్తుందన్నట్టు ఇప్పుడు కూడా ఒకంటిరిగా దొరికిన ఓ జింకను చిరుత వేటకు దిగుతుంది.
ఈ వేటలో చిరుత అత్యంత వేగాన్ని ప్రదర్శిస్తూ తన ఎరపై నిత్యం ఓ కన్ను వేస్తూ ఎలా పరుగెడుతుందో చూడొచ్చు.
ఇక చివరకు తన ఎరను పట్టేసుకోవడం చూడొచ్చు.
స్పిరిట్ లో స్టార్ హీరో ప్రభాస్ అలా కనిపించనున్నారా.. ఇదే జరిగితే అరాచకం!