వైరల్ వీడియో: పక్షులు, జంతువుల స్వచ్ఛమైన స్వరాలతో ‘ సారే జహసే అచ్చా’..!
TeluguStop.com
ఏ దేశ ప్రజల పైన వారి దేశ గణతంత్ర వేడుకలు వచ్చినప్పుడు మాత్రమే దేశభక్తి బయటికి వస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇందులో భాగంగానే అనేకమంది మనదేశంలో జనవరి 26, ఆగస్టు పదహైదు వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో దేశస్వాతంత్రానికి సంబంధించి తెగ లెక్చరర్లు ఇస్తుండడం గమనిస్తూనే ఉంటాం.
గణతంత్ర వేడుకల్లో భాగంగా అటు సోషల్ మీడియాలోనూ, ఇటు టీవీ ఛానల్ లో కూడా దేశభక్తి గీతాలతో, గణతంత్ర వేడుకల ప్రసారలతో మారు మోగుతున్నాయి.
అందరూ కూడా త్రివర్ణ రంగుల చిత్రాలు, బ్యాడ్జీలతో వారి దేశభక్తిని తెలుపుతున్నారు.ఇందులో భాగంగానే తాజాగా ‘యానిమల్ ప్లానెట్ ఇండియా’ వారు సరికొత్తగా వారి దేశభక్తిని తెలియజేశారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.‘సారే జహా సే అచ్చా’ అనే పాటలు జంతువుల స్వరాలతో మిక్స్ చేసి ఒక వీడియోను రూపొందించి దాని యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ముంబైకు చెందిన అకాపెల్లా బ్యాండ్ రాగా ట్రిప్పిన్ ఈ పాటను రూపొందించినట్లు సమాచారం.
ఈ వీడియోలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ " భారతదేశంలోని అద్భుతమైన జీవ వైవిధ్యానికి మా కానుక.
మీకు సంతోషంగా అందిస్తున్నాం" అంటూ పోస్ట్ చేశారు.ఈ పాటలు మన దేశంలోని వివిధ రకాల జంతువులు వాటి స్వరాలను అత్యద్భుతంగా వినిపించి ఎంతోమందిని ఆకట్టుకుంటున్నారు.
వీడియోను చుసిన నెటిజన్స్ వారి స్టైల్ లో స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
కాంగ్రెస్ తో మేము పనిచేసే ఉంటే నీకు చిప్పకూడే