వైరల్ వీడియో: హైలో హైలెస్సా.. అంటున్న ప్రియాంక గాంధీ..!

కాంగ్రెస్ ప్రముఖ నేత ప్రియాంక గాంధీ మౌనీ అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద పవిత్ర స్నానమాచరించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పవిత్ర సంగమం వద్ద సుజిత్ నిషాద్ అనే మత్స్య కారుడి బోటులో ప్రయాణం కొనసాగించారు.

తాజాగా అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.ఈ తరుణంలో మత్స్యకారుడు సుజిత్ మాట్లాడుతూ.

స్థానిక పోలీసులు మత్స్య కారులను వేధిస్తున్నట్లు, అలాగే వారి బోట్లను సర్వ నాశనం చేస్తున్నట్లు వారి బాధలు తెలియజేశాడు.

అలాగే మీరు ఏదో ఒక విధంగా మనకు ఆదుకోవాలని ప్రియాంక గాంధీని సుజిత్ కోరగా ఆమె అందుకు అంగీకరించి ఉత్తరప్రదేశ్ లో ఆ ప్రాంతానికి వచ్చి వందలాది మత్స్య కారు బోట్ల పై ఆధారపడి జీవిస్తున్నట్లు మరికొందరిని కలిసి వారి బాధలను తెలుసుకున్నారు.

ఇదిలా ఉండగా మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2019లో రాష్ట్రవ్యాప్తంగా నది నుంచి ఇసుక తవ్వకాల కోసం పడవలను వినియోగించుకోవడం నిషేధం విధించింది.

దీంతో మృత్య కారులకు ఉపాధి లేకుండా పోయి అప్పటి నుంచి వారికి ఏదో ఒక ఉపాధి కల్పించాలని ప్రభుత్వాని కోరుతూ ఉన్నారు.

నేడు ప్రియాంక గాంధీ ప్రయాగ్ రాజ్ సందర్శించి అక్కడి నుంచి బాన్స్ వార్ గ్రామానికి చేరుకుంటారని అధికారులను కలుసుకొని వారి యోగక్షేమాలను తెలుసుకుంటారని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలియజేస్తున్నారు.

"""/"/.

అకీరా.. ఆద్య కొణిదేల వారసులు కారా… ఇంటి పేర్లను మార్చిన పవన్!