వైరల్ వీడియో : పెళ్లి కోసం షాపింగ్ వెళ్తే.. చివరికి..?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.కరోనాను నియంత్రించడం కోసం ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు పెడుతున్నారు.

అయితే ప్రజలు ప్రభుత్వం పెట్టిన నిబంధనలు, నియమాలను పాటించకపోవడం వల్ల చాలా మంది కరోనాను కొని తెచ్చుకుంటున్నారు.

పోలీసులు ఫ్రంట్ వారియర్స్ గా పోరాడుతున్నారు.ప్రస్తుతం దేశంలో రోజూ 4 లక్షల కేసులు వస్తున్నా లాక్‌డౌన్ పెట్టడం లేదు.

అయితే రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు లాక్ డౌన్ లను అమలు చేస్తున్నాయి.మధ్యప్రదేశ్‌లో రోజూ 10వేలకు పైగా పాజిటివ్ కేసులు రావడంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ అమలుచేస్తోంది.

లాక్ డౌన్ వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు.అయితే కొన్ని కార్యక్రమాల వల్ల వెళ్లక తప్పదు.

తాజాగా లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడు ఓ ఫ్యామిలీ పెళ్లికి సంబంధించిన బట్టలు, నగలు, ఇతర సామాన్లు కొనుక్కోవడానికి వెళ్లింది.

పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇలా చాలా చోట్ల జరుగుతోంది.మధ్యప్రదేశ్‌లోనూ ఓ పెళ్లి కోసం ఇలా షాపింగ్ చేయడానికి బజారుకు వెళ్లారు.

స్థానికంగా ఉండే దాతియా ఏరియాలో వ్యాపారులు షాపుల షట్టర్లు మూసేసి లోపల వ్యాపారం చేస్తున్నారు.

పైకి లాక్‌డౌన్ అమల్లో ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల షాపింగ్ జరిగిపోతోంది.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అలర్ట్ అయ్యారు.

షాపుల వద్దకు వెళ్లి వారే స్వయంగా షట్టర్లు తెరిచారు.లోపల మహిళలు, వ్యాపారులు, సిబ్బంది అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.

పోలీసుల వార్నింగ్‌తో మహిళలు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేయగా పోలీసులు షాప్ నిర్వాహకులను కఠినంగా మందలించారు.

ఇంకెప్పుడూ ఇలా జరగదనీ, ఈసారికి వదిలేయమని బతిమలాడినా పోలీసులు వినలేదు.షాపు నిర్వాహకులను పోలీస్ స్టేషన్‌కి తీసుకుపోయారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.ఈ సందర్భంగా ఇలాంటి పనులు చేసి కరోనాను వ్యాప్తి చేయకండని పోలీసులు ప్రజలకు సూచించారు.

కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్..: సీఎం జగన్