ఇదేంటి బ్రో.. ఆటోను ఇంటిపైకి అలా ఎక్కిస్తున్నావ్.. వైరల్ వీడియో..

ప్రతిరోజు సోషల్ మీడియాలో వివిధ రకాలకు సంబంధించిన అనేక వైరల్ వీడియోలు( Viral Videos ) ప్రత్యక్షమవుతూ ఉంటాయి.

అందులో ఎక్కువగా నవ్వడానికి వీలుగా ఉండే వీడియోలు వైరల్ గా మారడం మన గమనించి ఉంటాం.

ఇందుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో గమనించవచ్చు.ఒక్కోసారి జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారడం మనం గమనించే ఉంటాం.

ఇకపోతే తాజాగా ఆటో డ్రైవర్( Auto Driver ) తాను ఇంతకాలం నడిపిన ఆటోని తన ఇంటి పైకి పెట్టడం సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే. """/" / చాలామంది వారి కుటుంబ సభ్యులను కంటి ముందర పెట్టుకున్న గాని సరిగా చూసుకొని రోజులు ఇవి.

అలాంటిది ఓ ఆటో డ్రైవర్ చాలా రోజుల నుండి తనతో పాటు తన కుటుంబానికి అన్నం పెడుతున్న ఆటోను పాతబడిందని అమ్మి వేయకుండా తనకి కృతజ్ఞతలు చూపించాలని ఏకంగా ఆ ఆటోను తాను కొత్తగా కట్టుకున్న ఇంటిపైన పెట్టుకోవడం జరిగింది.

తనకి ఆటో నడుపుతున్న సమయంలో తాను కూడా ఓ సొంత ఇంటిని కట్టుకోవాలని ఆశగా ఉన్న సమయంలో.

ఈ ఆటో వల్ల తాను బ్రతకడమే కాకుండా మరింత డబ్బును పోగుచేసుకొని ఇల్లు కూడా కట్టుకున్నానని తెలిపాడు.

దీంతో తన సొంతింటి కల నెరవేరడంతో.ప్రస్తుతం ఆటో కాస్త పాత పడడంతో ఆటోను పక్కన పెట్టకుండా అదే ఇంటిపై ఏర్పాటు చేసుకున్నాడు.

"""/" / ఇక ఈ ఆటో డ్రైవర్ చేసిన పనికి ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం సమాజంలో చాలామంది సొంత వారిని పట్టించుకోవట్లేదని.కానీ.

, నువ్వు మాత్రం నీ ఆటోను విడిచి పెట్టలేదంటూ నువ్వు నిజంగా గ్రేట్ భయ్యా.

అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరైతే.

, కాస్త చమత్కారంగా కూడా కామెంట్ చేస్తున్నారు.ఆటో కాబట్టి సరిపోయింది.

అదే ఒకవేల లారీ అయ్యి ఉంటే పరిస్థితి ఏంటి భయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు.

క్లీంకారకు గోరుముద్దలు తినిపించడం నాకెంతో ఇష్టం.. చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!