వైరల్ వీడియో: కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో విందు ఏర్పాటు
TeluguStop.com
సంక్రాంతి పండుగ( Sankranti Festival ) వచ్చిందంటే చాలు.తెలుగు రాష్ట్రాలలో ప్రతి కుటుంబంలో మంచి కోలాహలం ఉంటుంది.
ఇకపోతే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా ప్రత్యేక విందులు ఏర్పాటవుతుంటాయి.
కొన్ని చోట్ల కొత్తగా పెళ్లి అయ్యాక అల్లుడికి ఇంటికి వచ్చిన సమయంలో అత్తమామలు చేసే మర్యాదలు అంత ఇంత కాదు.
ఇందుకు సంబంధించి చాలా విషయాలు అనేకమార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
"""/" /
ముఖ్యంగా ఇలాంటివి గోదావరి జిల్లాలో ఎక్కువుగా కనపడుతుంటాయి.అలాంటిదే, తాజాగా ఈ పండుగను మరింత ప్రత్యేకంగా మార్చిన ఘటన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబంలో జరిగింది.
యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాజేటి సత్య భాస్కర్,( Majeti Satya Bhaskar ) తన ఏకైక కుమార్తె హరిణ్య( Harinya ) వివాహం తర్వాత మొదటి సంక్రాంతి పండుగను తన కొత్త అల్లుడు సాకేత్‌కు ఏకంగా 465 రకాల వంటకాలతో అద్భుతమైన విందు ఏర్పాటు చేశారు.
"""/" /
సంక్రాంతి పండుగ సందర్భంగా, సత్యభాస్కర్ తన కొత్త అల్లుడిని ఆహ్వానించి పసందైన వంటకాలతో అద్భుతమైన విందు భోజనం ఏర్పాటు చేశారు.
465 రకాల వంటకాలు వంటగదిలో చేసిన ఈ ప్రత్యేక విందు అందరికీ జ్ఞాపకార్హంగా మారింది.
ఈ ఘన విందులో వైవిధ్యమైన వంటకాలతో పాటు, ప్రత్యేకమైన ఆతిధ్యాన్ని అందించిన సత్యభాస్కర్ కుటుంబానికి అభినందనలు వెల్లువెత్తాయి.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
అల్లుడు సాకేత్ అదృష్టవంతుడిని కొందరు కామంట్స్ చేస్తుంటే.మరికొందరు పెళ్లి చేసుకుంటే ఇలాంటి వారి ఇంట్లో చేసుకోవాలని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను చూసి మీకేమనిపించిందో ఒక కామెంట్ చేయండి.