వైరల్ వీడియో: పరోటాలలో ‘ వేప పరోటా ‘ వేరయా.. బ్రేక్ ఫాస్ట్ గా వేప పరోటా..

నిత్యం సోషల్ మీడియా( Social Media )లో వంటలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

కొన్ని వంటలు ఆరోగ్యానికి మంచి చేస్తూ ఉంటే.మరికొన్ని అయితే అవి తినడానికి కూడా వీలు లేకుండా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక ఆరోగ్య ప్రయోజనాల వివిధ రకాల పదార్థాలతో వంటలు చేసుకుని మరి తినడం మనం చూస్తూనే ఉంటాం.

ఇందులో భాగంగానే మీరు ఎప్పుడైనా వేపాకు పరోటా తిన్నారా.అసలు ఇంతకు వేపాకు పరోటా అనే పేరు అయినా విన్నారా.

"""/" / మనం సాధారణంగా ఆలు పరాఠా, బట్టర్ నాన్స్ లాంటివి చూస్తూనే ఉంటాం.

అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా వేపాకుతో వేప పరోటా తయారు చేయడం మనం చూడవచ్చు.

వాస్తవానికి వేపాకులు మన శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి.ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధాలు కలిగి ఉండడం, అలాగే ఉదయాన్నే వేప పిండిని తీసుకోవడంతో శరీరంలోని సగం రోగాలు మటు మాయం అవుతాయని చాలా రుజువులు కూడా ఉన్నాయి.

ఇక వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిల్చని వేప పరోటాలు( Neem Parota ) తయారు చేయడం మనం చూడవచ్చు.

ఇక ఈ వేప పరోటాలు తయారీ కోసం ముందుగా ఆ వ్యక్తి వేప చెట్టు నుండి కొన్ని తాజా ఆకులను తీసి వాటిని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేస్తాడు.

అనంతరం ఆ వేపాకు మొక్కలను ఉల్లిపాయ, పన్నీరు, మసాలా పొడులు ఇలా మొదలైగు వాటిని కలిపి ఒక మిశ్రమం లాగా తయారు చేసుకుంటాడు.

అనంతరం చపాతీ పిండి( Chapati Flour ) తీసుకొని రొట్టె లాగా చేసి అందులో మల్లి ఈ మిశ్రమాన్ని పెట్టి పరోటాగా చేయడం మనం చూడవచ్చు.

"""/" / ఆతర్వాత ఆ పరోటాలు వేడి చేయడం కోసం ఓ పెన్నంను వేడి చేసి ఈ వేప పరోటా వేసి కాలుస్తాడు.

ఇక ఈ వీడియోను ఓ ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్స్ ను బాగా అక్కటుకుంటుంది.

ఈ వీడియో చుసిన కొంతమంది వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియో చూసిన తర్వాత నా నోరు పూర్తిగా చేదుగా మారిందని ఒకరు కామెంట్ చేస్తే.

మరికొందరేమో.‘డయాబెటిక్ పేషెంట్లకు దీన్ని తినిపించాలి’ అని కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందొ ఓ కామెంట్ చేయండి.

అంబానీ పెళ్లి వేడుక..160 యేళ్ళ వయస్సు చీర కట్టిన అలియా … చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?