వైరల్ వీడియో: పెళ్లి చేసుకుంటున్న దంపతులు మండపంలో లేకపోయినా సంప్రదాయబద్ధంగా వివాహం.. ఎలా అంటే..?!

పెళ్లి జరగాలంటే ఎవరున్నా లేకున్నా వధువరులు ఇద్దరు ఉంటే చాలు పెళ్లి జరిగిపోతుంది.

వివాహ మండపంలో బంధువులు, స్నేహితులు, మిత్రులు మధ్య అంగరంగ వైభవంగా జరిగే పెళ్లి వేడుకలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కదా ముఖ్యం కానీ పెళ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఇద్దరు కూడా మండపంలో లేరు.

కానీ బంధువులు, ఆప్తులు అందరు పెళ్లి వేడుకకి వచ్చారు.పెళ్లి కూడా నూతన దంపతులు లేకుండానే శాస్త్రోతమంగా, వేద పండితుల ఆదీనంలో జరిగింది.

ఏంటి షాక్ అవుతున్నారా.? లేక ఇదెలా సాధ్యం అని అనుకుంటున్నారా ఈ పెళ్లి వెనుక గల మిస్టరీ వీడాలంటే అసలు వివరాలలోకి వెళ్ళలిసిందే మరి.

ప్రస్తుతం మనం అందరం కరోనా కాలంలో ఉన్నాము.ఎటువంటి పని తలపెట్టాలన్న ఎక్కడ కరోనా వైరస్ వస్తుందేమో అనే ఆలోచనలో ఉంటున్నాము.

ఈ క్రమంలోనే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులుగా పెళ్లిళ్లు కూడా ఆన్లైన్ లో కానిచ్చేస్తున్నారు.

ఇలా ఆన్లైన్ లో జరిగిన పెళ్లే మనం చెప్పుకోబోయే పెళ్లి అన్నమాట.కర్నూలు జిల్లాకు చెందిన మధుసూదన్ రెడ్డి శైలజారెడ్డి దంపతులకు రజిత అనే కూతురు ఉంది.

ఆమెకుతెలంగాణ రాష్ట్రంలోని నల్గొండకు చెందిన వెంకట్రామిరెడ్డి, కవితల కొడుకు అయిన దినేష్ రెడ్డితో వివాహం జరిపించాలని రెండు సంవత్సరాల క్రితం పెద్దలు అనుకున్నారు.

కానీ రజిత, దినేష్ ఇద్దరు కూడా ఆస్ట్రేలియాలోని డింబోలలో ఉద్యోగం చేస్తున్నారు.కరోనా కారణంగా వారు ఆస్ట్రేలియా నుండి భారత్ కి వచ్చే అవకాశం లేని కారణంతో కర్నూలులో గల ఒక ఫంక్షన్ హాల్లో ఆన్లైన్లో వాళ్ళ పెళ్లి జరిపించారు.

"""/"/ నూతన వధూవరులు ఇద్దరు కూడా ఆస్ట్రేలియాలోని ఒక కల్యాణ మండపంలో ఉండి అక్కడ జరిగే దానిని ఇక్కడ ఫంక్షన్ హల్ లో కనిపించే విధంగా ఒక తెరను ఏర్పాటు చేసారు.

అలాగే కర్నూలులో బ్రాహ్మణుడు చెప్పే మాటలు ఆన్లైన్ లో విని ఆయన చెప్పిన విధంగా సాంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకుని ఒకటి అయ్యారు.

ఈ ఆన్లైన్ పెళ్లి చూడడానికి కర్నూల్ ఫంక్షన్ హల్ కి ఇరు వర్గాల కుటుంభ సభ్యులు హాజరు అయ్యారు.

ప్రస్తుతం ఈ ఆన్లైన్ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఏంటి జూనియర్ ఎన్టీఆర్ చేజేతులా ఇంత పెద్ద నష్టం తనకు తానే చేసుకున్నారా ?