వైరల్ వీడియో: ముంబై పోలీస్ అంటూ ఫోన్ చేసిన వ్యక్తికి చుక్కలు చూపించిన వ్యక్తి..

ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్( Cybercrime ) సంబంధించిన అనేక సంఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాము.

కొత్త కొత్త రకాల క్రైమ్ చేస్తూ ప్రజల సొమ్మును కాజేస్తున్నారు కేటుగాళ్లు.మనకు ఆ స్కీం.

ఈ స్కీం.అంటూ మాటల్లో పెట్టేసి మన డిజిటల్ డేటా( Digital Data )ను సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ.

చివరికి మన బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును దోచేస్తున్నారు కేటగాళ్లు.అయితే ఇలాంటి విషయాల్లో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త విధానంలో ప్రజలను మోసం చేస్తూ దోచేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా కేటుగాడు పోలీస్ అవతారమెత్తి డబ్బులను కాజేయాలని ప్రయత్నం చేశాడు.

అయితే ఆ ప్రయత్నాన్ని వ్యక్తి తిప్పి కొట్టడంతో ఆ వ్యక్తిని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే. """/" / ముంబై ( Mumbai )నగరంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తికి +92 తో ఉన్న ఫోన్ వచ్చింది.

నిజానికి ఇది పాకిస్తాన్ సంబంధించిన ఫోన్ నెంబర్.ఈ విషయం అతడికి అవగాహన ఉండడంతో మొదట అవతల ఫోన్ చేసిన వారి మాటలు మొత్తం విని ఆ తర్వాత స్పందించాడు.

ఇక ఫోన్ చేసిన వ్యక్తి మొదటగా ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తితో నీ కుమారుడుని, అతనితో పాటు మరో ఇద్దరినీ రేప్ కేసులో అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో పెట్టినట్టు నమ్మించబోయాడు.

అయితే అది ఫ్రాడ్ కాల్ అని తెలుసుకున్న వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తితో మీరు అసలు ఏ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారు, ఎక్కడికి రావాలన్న విషయాలను అడుగుతుండగా.

ఒకసారిగా ఫోన్ కట్ చేసేసాడు. """/" / ఈ ఫోన్ కాల్ లో మోసగాడు కాల్ చేసి మీ అబ్బాయి రేపు కేసులో అరెస్టు అయ్యాడని.

తమకి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, ఇంకా మీడియాకు చెప్పకుండా ఉండేందుకు 40 వేలు ఫోన్ పే చేయాలంటూ కోరాడు.

అయితే ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి 40 వేలు ఏమి సరిపోతాయి.రేప్ కేసు కదా నాలుగు లక్షల తీసుకోండి అంటూ కాస్త చమత్కారంగా మాట్లాడాడు.

దాంతో పాకిస్తాన్ నుంచి ఫోన్ చేసిన వ్యక్తికి అసలు విషయం అర్థమై వెంటనే ఫోన్ కట్ చేసేసాడు.

కాబట్టి ఇలాంటి సంఘటనలతో కూడా ప్రస్తుతం డబ్బు కోసం కొందరు చేస్తున్నారు.ప్రజలు ఇలాంటి విషయాలపై కాస్త అలర్ట్ గా ఉండడం ఎంతో మంచిది.

అన్ని పార్టులుగా మహేష్ జక్కన్న కాంబో మూవీ.. ఫ్యాన్స్ సంబరానికి హద్దులు ఉండవుగా!